Home

»

Featured News

ప్రభాస్ కెరీర్‌లో టాప్ 10 సినిమాలు: నంబర్ 1 ఏదో తెలుసా.?

Oct 22, 2026 5:45PM

ఒకప్పుడు టాలీవుడ్‌లో లవర్ బాయ్‌గా అమ్మాయిల మనసులు గెలుచుకున్నాడు.. ఆ తర్వాత మాస్ సినిమాలతో థియేటర్లలో రచ్చ చేశాడు.. ఇక బాహుబలిగా మారిన తర్వాత పాన్ ఇండియా ప్రేక్షకుల దృష్టినే తనవైపు తిప్పుకున్నాడు. ఆయనే మన రెబల్ స్టార్ ప్రభాస్.

అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా.. ఆయన కెరీర్‌ను మలుపు తిప్పిన టాప్ 10 సినిమాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.

వర్షం:
ప్రభాస్ కెరీర్‌లో మొదటి హిట్ ‘వర్షం’. శోభన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా యూత్ ను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా లవ్ స్టోరీ, ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. ఈ సినిమాతో ప్రభాస్ లవర్ బాయ్ ఇమేజ్‌తో పాటు యాక్షన్ చేయగల హీరోగా కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఛత్రపతి:
ప్రభాస్ అంటే మాస్ అనే ఇమేజ్‌ను బలంగా నిలబెట్టిన సినిమాల్లో ‘ఛత్రపతి’కి ప్రత్యేక స్థానం ఉంటుంది. రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రభాస్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ సన్నివేశాల్లో చూపించిన ఇంటెన్సిటీ ఆయనను మాస్ ప్రేక్షకులకు దగ్గర చేశాయి.

బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై: 
ఈ సినిమా ఆశించినంత విజయం సాధించకపోయినా ఈ సినిమాలోని ప్రభాస్ స్టైల్ అండ్ డైలాగ్ డెలివరీకి ఎందరో అభిమానులుగా మారిపోయారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రభాస్ కామెడీని కూడా సూపర్ గా చెయ్యగలడని బుజ్జిగాడు మూవీ రుజువు చేసింది.

డార్లింగ్:
మాస్ ఇమేజ్ మాత్రమే కాదు.. తనలోని రొమాంటిక్ హీరోను కూడా ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా చూపించిన సినిమా ‘డార్లింగ్’. కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ప్రభాస్ లవర్ బాయ్ లా కనిపించాడు. ప్రభాస్‌లోని హ్యాండ్సమ్, కూల్, రొమాంటిక్ కోణాన్ని గుర్తుచేసుకోవాలంటే ‘డార్లింగ్’ తప్పకుండా చూడాల్సిన సినిమా.

మిస్టర్ పర్ఫెక్ట్:
దశరథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర మొదట్లో తనకు నచ్చినట్టుగా జీవించాలనుకునే వ్యక్తిలా కనిపిస్తుంది. కానీ ప్రేమ, కుటుంబ అనుబంధాలు, జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు అతని ఆలోచనా విధానాన్ని మార్చేస్తాయి. భారీ యాక్షన్ సన్నివేశాలు లేకపోయినా.. తన కామెడీ టైమింగ్, ఎమోషన్స్ తో ప్రేక్షకులను మెప్పించగలనని ప్రభాస్ నిరూపించిన సినిమాల్లో ఇదొకటి.

మిర్చి:
ప్రభాస్ కెరీర్‌లో మాస్, క్లాస్, రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ కలిసిన సినిమా ఏదంటే చాలామందికి గుర్తొచ్చే పేరు ‘మిర్చి’. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ప్రభాస్ స్టైలిష్ లుక్ కి అందరూ ఫిదా అయ్యారు. మాస్ యాంగిల్ కు కూడా అదే రేంజ్ లో న్యాయం చేసి బాక్సాఫీస్ ను షేక్ చేశాడు.

సలార్:
‘సలార్’తో ప్రభాస్ తన అసలైన మాస్ ఎనర్జీని మరోసారి ప్రేక్షకులకు గుర్తుచేశాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ దేవ అనే పాత్రలో కనిపించాడు. ప్రభాస్ స్క్రీన్ ప్రజెన్స్, ఎలివేషన్స్ అభిమానులకు ట్రీట్‌గా నిలిచాయి.

కల్కి 2898 AD:
భారతీయ పురాణాలను సైన్స్ ఫిక్షన్‌తో ముడిపెడితే ఎలాంటి అద్భుతం సాధ్యమవుతుంది? ఈ ఆలోచనకు తెరరూపమే ‘కల్కి 2898 AD’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ భైరవ పాత్రలో కనిపించారు. ముఖ్యంగా కర్ణుడిగా సర్ప్రైజ్ చేశారు.

బాహుబలి - ది బిగినింగ్:
ప్రభాస్ కెరీర్‌ను పూర్తిగా మార్చేసిన సినిమా ‘బాహుబలి’. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారతీయ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. శివుడు, అమరేంద్ర బాహుబలి పాత్రల ద్వారా ప్రభాస్ రెండు భిన్నమైన కోణాలను చూపించాడు. ఈ సినిమాతో ప్రభాస్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. 

బాహుబలి 2 - ది కన్‌క్లూజన్:
ప్రభాస్ కెరీర్‌లో నంబర్ వన్ స్థానం అంటే.. చాలా మందికి మరో ఆలోచన లేకుండా గుర్తొచ్చే సినిమా ‘బాహుబలి 2: ది కన్‌క్లూజన్’. అమరేంద్ర బాహుబలి పాత్రలో ప్రభాస్ చూపించిన రాజసం, ప్రజల కోసం నిలబడే నాయకత్వం, కుటుంబం కోసం పడే సంఘర్షణ ప్రేక్షకులను కట్టిపడేశాయి. అదే సమయంలో మహేంద్ర బాహుబలిగా ప్రతీకారం తీర్చుకునే పాత్రలోనూ ప్రభాస్ తనదైన ముద్ర వేశాడు. ఈ సినిమా కేవలం భారీ కలెక్షన్లు సాధించిన చిత్రంగా మాత్రమే నిలవలేదు. భారతీయ సినిమా మార్కెట్‌ను ఎన్నో రెట్లు పెంచి, ప్రపంచస్థాయికి మన సినిమాను చేర్చింది.

 

 

 

[Prabhas Top 10 Movies, Prabhas Best Movies, Prabhas Birthday Special 2026, Happy Birthday Prabhas, Prabhas Birthday, Rebel Star Prabhas, Prabhas Hit Movies, Prabhas Movie Journey, Prabhas Movies, Telugu Film News] 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com