నటించిన ఈ సినిమా 2011లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. దక్షిణాది నటి సిల్క్ స్మిత జీవితంలోని కొన్ని అంశాల స్ఫూర్తితో తెరకెక్కిన ఈ చిత్రం.. అప్పట్లో ఎన్నో చర్చలకు దారితీసింది. ఇప్పుడు దాదాపు 15 ఏళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్‌ను రూపొందించేందుకు నిర్మాత ఏక్తా కపూర్ సిద్ధమయ్యారు. ‘ది డర్టీ పిక్చర్ 2’ తెరకెక్కించనున్నట్లు ఆమె తాజాగా వెల్లడించారు.
రణ్‌వీర్ అలహాబాదియా పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఏక్తా కపూర్.. ఈ సీక్వెల్ గురించి మాట్లాడారు. ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమాను మళ్లీ ఎందుకు చేయాలనుకుంటున్నారనే విషయాన్ని వివరిస్తూ, ఇప్పుడు చెప్పాలనుకున్న కొత్త కథ దొరికిందని తెలిపారు. మొదటి సినిమాలో సిల్క్ స్మిత జీవితాన్ని, తన లైంగికతను స్వేచ్ఛగా వ్యక్తపరిచినందుకు సమాజం ఆమెను ఎలా చూసిందనే అంశాలను చూపించామని ఏక్తా పేర్కొన్నారు. సిల్క్ స్మితను తాను బాధితురాలిగా కాకుండా, తన వ్యక్తిత్వాన్ని స్వేచ్ఛగా వ్యక్తపరిచిన మహిళగా చూశానని ఆమె చెప్పుకొచ్చారు.
అయితే, ‘ది డర్టీ పిక్చర్ 2’లో ఎవరి కథను చూపించబోతున్నారు? ఇందులో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారు? అనే విషయాలను మాత్రం ఏక్తా కపూర్ ఇంకా వెల్లడించలేదు. ఈ సీక్వెల్ కూడా ఒక వ్యక్తి జీవిత కథ చుట్టూ తిరుగుతుందని మాత్రమే ఆమె స్పష్టం చేశారు. దీంతో ఈసారి కథానాయికగా ఎవరు కనిపిస్తారనే అంశంపై ఆసక్తి నెలకొంది. విద్యాబాలన్ తిరిగి ఈ సినిమాలో నటిస్తారా లేదా అన్నది కూడా ఇంకా తెలియాల్సి ఉంది.
మొదటి ‘ది డర్టీ పిక్చర్’లో విద్యాబాలన్‌తో పాటు నసీరుద్దీన్ షా, ఇమ్రాన్ హష్మీ, తుషార్ కపూర్ కీలక పాత్రల్లో నటించారు. మిలన్ లుథ్రియా దర్శకత్వం వహించిన ఈ చిత్రం విద్యాబాలన్ కెరీర్‌లో ప్రత్యేకమైన సినిమాగా నిలిచింది. ఇప్పుడు సీక్వెల్ కోసం ఏక్తా కపూర్ ఎలాంటి కథను ఎంచుకున్నారు? మొదటి భాగంలాగే మహిళా ప్రధాన కథతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారా? అన్నది ఆసక్తికరంగా మారింది. సినిమా తారాగణం, దర్శకుడు, విడుదల తేదీకి సంబంధించిన వివరాలు ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
[The Dirty Picture 2, Ektaa Kapoor, Vidya Balan, Silk Smitha, The Dirty Picture Sequel, Bollywood Movie News, Ektaa Kapoor Latest News, The Dirty Picture 2 Cast, Woman Centric Bollywood Films, Ranveer Allahbadia Podcast]




