Home

»

Bollywood News

40 భాషల్లో ‘రామాయణ’: ఇండియన్ సినిమా చరిత్రలో మరో భారీ ప్రయోగం.!

Oct 12, 2026 4:39PM

ఇండియన్ సినిమా మార్కెట్‌ను ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలనే లక్ష్యంతో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘రామాయణ’. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను అంతర్జాతీయ ప్రేక్షకులకు మరింత చేరువ చేయడానికి మేకర్స్ భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా దాదాపు 40 భాషల్లో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే భారతీయ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మరింత పెద్ద మార్కెట్‌ను తెరిచే ప్రయత్నంగా నిలవనుంది.

నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా రెండు భాగాలుగా రూపొందిస్తున్న ఈ సినిమా కోసం భారీ స్థాయిలో ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలతో ఈ ప్రాజెక్ట్‌పై అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తి పెరిగింది.

సాధారణంగా భారతీయ సినిమాలు కొన్ని ప్రధాన భారతీయ భాషలతో పాటు ఎంపిక చేసిన విదేశీ మార్కెట్లలో విడుదలవుతుంటాయి. కానీ ‘రామాయణం’ విషయంలో మేకర్స్ మరింత పెద్ద లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. దాదాపు 40 భాషల్లో డబ్బింగ్ చేసి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

విదేశీ ప్రేక్షకులు సబ్‌టైటిల్స్‌పై మాత్రమే ఆధారపడకుండా.. తమకు అర్థమయ్యే భాషలోనే సినిమాను చూసే అవకాశం కల్పించాలన్నది ఈ ప్రయత్నం వెనుక ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. అయితే ఏయే భాషల్లో సినిమా విడుదలవుతుందనే పూర్తి వివరాలను మేకర్స్ ఇంకా వెల్లడించాల్సి ఉంది.

‘రామాయణం’ తొలి భాగాన్ని నవంబర్ 5, 2026న విడుదల చేయనున్నారు. విదేశీ మార్కెట్లలో భారీ స్థాయిలో విడుదల చేసేందుకు అంతర్జాతీయ పంపిణీ సంస్థలతో కలిసి చిత్రబృందం ఏర్పాట్లు చేస్తోంది.

ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా కనిపించనున్నారు. సన్నీ డియోల్ హనుమంతుడి పాత్రలో, రవి దూబే లక్ష్మణుడిగా నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్, హాన్స్ జిమ్మర్ సంగీతాన్ని అందిస్తున్నారు.

ఇది కూడా చదవండి: ట్రైలర్ లాంచ్‌కు రాలేదు.. ‘రణబాలి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రష్మిక వస్తుందా.?

 

 

 

[Ramayana 40 Languages, Ramayana Global Release, Ramayana Movie, Ranbir Kapoor, Sai Pallavi, Yash, Nitesh Tiwari, Namit Malhotra, Telugu Film News]
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com