English | Telugu
అనసూయ 45 వేలకు ఈవెంట్ చేస్తుందా?
Updated : Sep 11, 2021
'జబర్దస్త్'లో కొన్ని వారాలుగా ఫాహిమా (ఫైమా)కు స్పేస్ దొరుకుతోంది. టిపికల్ కామెడీ టైమింగ్‌తో ఫన్ క్రియేట్ చేస్తోంది. ఈ క్రమంలో ఫాహిమా హద్దు మీరుతున్నట్టు కనబడుతోంది. 'జబర్దస్త్'లో బాడీ షేమింగ్ ఎప్పటి నుండో ఉంది. ఇన్నాళ్లూ ఇతరుల అందాన్ని హేళన చేస్తూ ఎవరో ఒకరు పంచ్‌లు వేసేవారు. అయితే, తన అందంపై ఫాహిమా పంచ్‌లు వేసుకుంటోంది.
నెక్స్ట్ వీక్ వెంకీ మంకీస్ స్కిట్‌లో ఫాహిమా చేసింది. ప్రోమో చూస్తుంటే... 'శక్తి' సినిమా స్పూఫ్ చేసినట్టు ఉన్నారు. అందులో ఫాహిమా, బాబుకు మధ్య ఓ సీన్ ఉంది. 'నువ్వు నాకు కావాలి' అని బాబు అంటే... 'ఇదే మాట స్కిట్ అయిపోయాక చెప్పు. వస్తా' అని ఫాహిమా అంటుంది. అదిరే అభి స్కిట్‌లో రామును పట్టుకుని టోంబ్రి అన్నది. స్కిట్ తర్వాత కూడా రెచ్చిపోయింది. ఫాహిమా పంచ్‌లు పేలుతున్నాయి కాబట్టి కంటిన్యూ చేస్తారో? లేదంటే టీమ్ లీడర్లు కట్ చేస్తారో? చూడాలి.
ఇక, నెక్స్ట్ వీక్ 'హైపర్' ఆది స్కిట్ విషయానికి వస్తే... జబర్దస్త్ టీమ్ లీడర్లు, జడ్జ్‌లకు వయసు అయిపోతే, ముసలోళ్లు అయితే ఎలా ఉంటారనే థీమ్ తీసుకుని స్కిట్ చేశాడు. అందులో రామ్ ప్రసాద్ 'నా వేళ్ళు చూశావా? ఎలా అయిపోయాయో?' అంటే... 'అందరికీ గోకి గోకి గోళ్లు పోతే నీకు వేళ్ళు తిరిగిపోయాయి ఏంటి?' అని ఆది పంచ్ వేశాడు. 'ఆ లెక్కన చూస్తే నీకు వేళ్లే ఉండకూడదు' అని రామ్ ప్రసాద్ కౌంటర్ పంచ్ వేశాడు. 'నీకు గోళ్లు, నాకు వేళ్ళు అంటే ఆ సుధీర్ గాడికి ఏం అరిగిపోయి ఉంటాయో?' అని ఆది అనడంతో అందరూ నవ్వేశారు.
అనసూయ పాత్రను రైజింగ్ రాజు చేశాడు. వయసు అయిపోయిన తర్వాత అనసూయకు సరిగా వినపడదని, ఓ ఈవెంట్ కోసం 90 వేలు ఇస్తామంటే... 65 వేలు అడుగుతున్నట్టు చూపించారు. అలా కాదు... 65 ఇస్తామంటున్నారని ఆది చెప్పబోతే... 45వేలకు ఒప్పుకొన్నట్టు కన్‌క్లూజన్ ఇచ్చారు. రోజా పళ్ళ సెట్ తీసుకురమ్మని అనడం, ఆది డాన్స్ అంటే సెలైన్ పెట్టమని అడగటం నవ్వించాయి.