Read more!

English | Telugu

"ఎంత ప‌నిచేశావ్ డాక్ట‌ర్ బాబు?".. వెన్నెల కిశోర్ కూడా 'కార్తీక‌దీపం' ఫ్యాన్‌!

 

'కార్తీకదీపం' సీరియల్ గురించి తెలియని తెలుగు వారుండరు. బుల్లితెరపై ఈ సీరియల్ ఓ సంచలనం. ఇప్పటివరకు ఏ సీరియల్ కూడా దీన్ని బీట్ చేయలేకపోతోంది. టీఆర్పీలో ఈ సీరియల్ ఎప్పుడు టాప్ ప్లేస్ లోనే ఉంటోంది. సోషల్ మీడియాలో కూడా ఈ సీరియల్ హాట్ టాపిక్ అవుతుంటుంది. సెలబ్రిటీలు సైతం అప్పుడప్పుడు ఈ సీరియల్ గురించి మాట్లాడుతుంటారు. మొన్నామధ్య లక్ష్మీ మంచు 'కార్తీకదీపం' సీరియల్ ను ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ చేసింది. 

అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కమెడియన్ వెన్నెల కిశోర్ అప్పుడప్పుడు ఈ సీరియల్ మీద సెటైర్లు వేస్తుంటారు. రీసెంట్ గా డాక్టర్ బాబు, వంటలక్క మీద వెన్నెల కిశోర్ వేసిన పోస్ట్ తెగ వైరల్ అయింది. "అంత మంచి డాక్టర్ బాబుకి అంత మంచి వంటలక్క అంటే ఎందుకంత కోపం?" అని ట్వీట్ చేశారు. అది కాస్తా నెట్టింట్లో వెైరల్ అయింది.

ఇప్పుడు 'కార్తీకదీపం' సీరియల్ మలుపు తీసుకున్న సంగతి తెలిసిందే. మోనితా కడుపుతో ఉన్నానని.. దానికి కారణం కార్తీక్ అని చెప్పడంతో అందరూ డాక్టర్ బాబునే టార్గెట్ చేస్తున్నారు. దీనిపై రకరకాల మీమ్స్ ను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. వాటిలో ఒక మీమ్ ను వెన్నెల కిశోర్ పోస్ట్ చేశారు.  "ఎంత పని చేశావ్ డాక్టర్ బాబు?" అంటూ బ్రహ్మానందం స్టైల్లో ఉన్న మీమ్‌ను వెన్నెల కిశోర్ షేర్ చేయగా దాన్ని నిరుపమ్ తన ఇన్ స్టాలో స్టోరీలో పెట్టుకున్నాడు.