Read more!

English | Telugu

హైపర్‌ ఆదిపై పోలీసులకు ఫిర్యాదు

కమెడియన్‌ హైపర్‌ ఆదిపై తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు సోమవారం నాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ టీవీ కార్యక్రమంలో ఆది.. తెలంగాణ పండుగ బతుకమ్మ, దేవతగా పూజించే గౌరమ్మతో పాటు తెలంగాణ భాషను కించపరిచే విధంగా మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఆదితో పాటు స్క్రిప్ట్ రైటర్, నిర్మాణ సంస్థ మల్లెమాల ప్రొడక్షన్‌ పై చర్యలు తీసుకోవాలని ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్‌ రెడ్డికి ఫిర్యాదు చేశారు. 

బుల్లితెరపై తన కామెడి టైమింగ్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న హైపర్ ఆది.. డబుల్‌ మీనింగ్‌ డైలాగులు, హద్దుమీరిన కామెడీతో అప్పుడప్పుడు విమర్శల పాలవుతున్నాడు. గతంలో కూడా ఆదిపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదులు అందాయి. తమ మనోభావాలను దెబ్బతీసేలా టీవీ షోలో ఆది ఓ స్కిట్ చేశారని ఆరోపిస్తూ.. పలువురు హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. 

ఇప్పుడు తాజాగా ఆది తెలంగాణ భాషను, దేవతలను కించపరిచారు అంటూ ఫిర్యాదు నమోదైంది. మరి దీనిపై ఆది ఏం వివరణ ఇస్తారో చూడాలి.