English | Telugu
వేదని అడ్డంగా బుక్ చేసిన యష్
Updated : Dec 21, 2021
బుల్లితెర ప్రేమికుల్ని ఆకట్టుకుంటున్న సీరియల్ `ఎన్నెన్నో జన్మల బంధం`. యష్.. వేద, ఖుషీల మధ్య సాగే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సీరియల్ సాగుతోంది. గత కొన్ని వారాలుగా సరికొత్త మలుపులు తిరుగుతూ ఆసక్తిని రేకెత్తిస్తున్న ఈ సీరియల్ సోమవారం మరింత ఆసక్తికర సన్నివేశాలతో సాగింది. ఖుషీ తన వద్దకే రావడంతో ఆ విషయాన్ని యష్ కి తెలియజేస్తుంది వేద.
Also read:బిగ్‌బాస్ 'వీజే'త సన్నీకి దక్కింది ఎంత?
పాపని ఏదూనా వెకేషన్ కి తీసుకెళదామని చెప్పిన వేద వండర్ లాకి తీసుకెళుతుంది. తన వెంటే యష్ కూడా వెళతాడు. అక్కడ వేద .. ఖుషీని అడ్డంపెట్టుకుని ఓ ఆట ఆడుకుంటుంది. అయితే తన కంపనీ కోసం ఓ ముఖ్యమైన డీల్ ని ఫైనల్ చేయాల్సిన యష్ వేద పక్కనే వుండి పోవడంతో సదరు డీల్ కుదుర్చుకోవాలనుకున్న జంటే వండర్ లాకు వచ్చేస్తుంది.
Also read:గ్రాండ్ ఫినాలే సాక్షిగా వక్రబుద్ది చూపించిన షణ్ముఖ్
వారిని అక్కడ చూసిన యష్ ఎక్కడ దొరికి పోతానో అని తన భార్యగా వేదని నటించమని కోరతాడు. ముందు ససేమీరా అన్నా ఆ తరువాత ఓకే చెబుతుంది. దీంతో ప్రతీ సీన్ ఫన్ ని క్రియేట్ చేస్తూ వేదకు కోపాన్ని తెప్పించేలా సాగుతుంది. ఇంతకీ యష్ కంపనీతో డీల్ కుదుర్చుకోవాలనుకున్న భార్యా భర్తల జంట వేద, యష్ భార్యా భర్తలు కాదని తెలుసుకుంటుందా? .. ఈ విషయం తెలిసి యష్ ని వేద ఎలా ఆడుకుంది అన్నది తెలియాలంటే మంగళవారం ఎపిసోడ్ చూడాల్సిందే.