English | Telugu

ఇమ్మాన్యుయేల్‌కి షాకిచ్చిన వ‌ర్ష

బుల్లితెర కామెడీ షో `జ‌బ‌ర్ద‌స్త్‌`. ఈ షో తెలుగు ప్రేక్ష‌కుల్ని గ‌త కొన్నేళ్లుగా విశేషంగా అల‌రిస్తున్న విషయం తెలిసిందే. ఈ షో ద్వారా చాలా జంట‌లు పాపులారిటీని సొంతం చేసుకున్నాయి. అందులో ఇమ్మాన్యుయేల్ , వ‌ర్ష జంట‌. న‌ల్ల‌ని అబ్బాయి వెంట‌ప‌డే అమ్మాయిగా వ‌ర్ష పాపులారిటీని సొంతం చేసుకుంది. ఈ ఇద్ద‌రికి బుల్లితెర‌పై హిట్ పెయిర్‌గా మంచి క్రేజ్ ద‌క్కింది. దీంతో వీరిద్ద‌రిపై ప్ర‌త్యేకంగా ఈవెంట్ ల‌ని కూడా నిర్వ‌హించారు.

అయితే ఈ జంట‌పై కొంత మంది కామెంట్‌లు చేయ‌డంతో మ‌న‌స్తాపానికి గురైన వ‌ర్ష ఆ త‌రువాత నుంచి ఇమ్మాన్యుయేల్‌తో స్కిట్‌లు చేయ‌డం త‌గ్గించేసింది. ఒక ద‌శ‌లో జ‌బ‌ర్ద‌స్త్‌ని వ‌దిలేస్తున్నానంటు కూడా వ‌ర్ష ప్ర‌క‌టించి షాకిచ్చింది. అయితే తాజాగా ఈ జోడీ ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్‌లో ద‌ర్శ‌న‌మిచ్చింది. ఈ సంద‌ర్భంగా వ‌ర్ష‌పై ఇమ్యాన్యుయేల్ పంచ్‌లు వేయ‌డం.. దానికి వ‌ర్ష కూడా కౌంట‌ర్ ఇవ్వ‌డం న‌వ్వులు పూయిస్తోంది. ఇమ్మానుయేట్ త‌నతో స్కిట్ చేస్తున్న యువ‌తిని త‌న పెదాలు త‌డ‌పొచ్చుక‌దా అంటాడు. దానికి ఆ అమ్మాయి నీళ్లు ఇమ్మాన్యుయేల్ ముఖాన నీళ్లు కొడుతుంది.

దానికి పెదాలు త‌డ‌ప‌డం అంటే ఇది కాదు వ‌ర్ష‌ని చూసి నేర్చుకోవాలి. వ‌ర్ష అయితే సునామీలా కుమ్మేసి పెదాల‌ని త‌డిపేస్తుంది. ఈ మాట‌లు విన్న వ‌ర్ష ఆశ్చ‌ర్యానికి లోనైంది. ఆ వెంట‌నే ఇదే స్కిట్‌లో నూక‌రాజు త‌న చివ‌రి ఇకోరిక వ‌ర్ష‌ని హ‌గ్ చేసుకోవ‌డం అని చెబుతాడు. ఇదే మంచి ఛాన్స్ అని భావించిన వ‌ర్ష ప‌కోడీ గాడికే హ‌గ్ ఇచ్చాను నికివ్వ‌నా అంటూ నూక‌రాజుకి వ‌ర్ష హ‌గ్ ఇచ్చేయ‌డం ఇమ్మాన్యుయేల్ ని షాక్‌కు గురిచేసింది.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.