English | Telugu
గాయత్రీ దేవి ఆత్మ చెప్పిన అద్దంలో ఏముంది?
Updated : Jun 21, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `త్రినయని`. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సీరియల్ గత కొన్ని వారాలుగా విజయవంతంగా ప్రసారం అవుతోంది. జరగబోయేది ముందే తెలిసే వరం వున్న ఓ యువతి తన భర్త తల్లి మర్దర్ మిస్టరీని ఎలా ఛేదించింది?.. సవతి తల్లి కుట్ర నుంచి తన భర్తని ఎలా కాపాడుకుంది అనే ఆసక్తికరమైన కథ, కథనాలతో ఈ సీరియల్ మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటూ విజయవంతంగా సాగుతోంది. ఇందులో అషికా గోపాల్, చందూ గౌడ కీలక జంటగా నటించారు. ఇతర పాత్రల్లో పవిత్ర జయరామ్, నిహారిక హర్షు, విష్ణు ప్రియ, శ్రీసత్య, భావనా రెడ్డి, సురేష్ చంద్ర, అనిల్ చౌదరి, ద్వారకేష్ నాయుడు నటించారు.
తన తండ్రి పుండరీ నాథం రాసిన వీలు నామాలో వున్న రహస్యం తెలియాలంటే పున్నమినాటి చంద్రుని వెలుగులో నాన్న గీసిన చిత్రాన్ని అద్దంలో పెట్టి చూడాలని నయనితో గాయత్రీ దేవి ఆత్మ చెబుతుంది. అయితే ఆ అద్దం తిలొత్తమ ఇంట్లో వుండటంతో విశాల్, నయని కొంత మందిని తీసుకుని ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ అంటూ రైడ్ కి వచ్చామంటూ తిలోత్తమ ఇంట్లో హడావిడి చేస్తారు. ఇల్లంతా జల్లెడ పడతారు. చివరికి హాసిని సహాయంతో పెద్ద అద్దం వెనకాల గాయత్రీ దేవి చెప్పిన చిన్న అద్దం లభిస్తుంది. ఇదే సమయంలో వల్లభ, కసి అక్కడికి వస్తారు.
వారిని డైవర్ట్ చేసి విశాల్, నయని.. గాయత్రిదేవి చెప్పిన అద్దాన్ని చాకచక్యంగా ఇంటికి తెచ్చుకుంటారు. ఇదే సమయంలో గాయత్రీ దేవి ఆత్మ మళ్లీ వస్తుంది.. సమయం దగ్గరపడుతోందని నేను చెప్పింది చేయమని చెబుఏతుంది. దీంతో పౌర్ణమి రోజు ఉదయాన్నే పూజ తో కార్యక్రమం మొదలు పెడుతుంది నయని. ఇదిలా వుంటే ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ రైడ్ పేరుతో మారు వేశాల్లో వచ్చింది విశాల్, నయని అని కసి అనుమానం వ్యక్తం చేస్తుంది. అనుమానం కాదని అదే నిజమని చెప్పడంతో తిలోత్తమ షాక్ కు గురవుతుంది. ఇంతకీ వాళ్లు పట్టుకెళ్లిన అద్దంలో ఏముందని వల్లభ అంటాడు. దీంతో తిలోత్తమకు చిర్రెత్తుకొచ్చి వల్లభని చీవాట్లు పెడుతుంది. అంతా కలిసి నయని ఏం చేయబోతోందో తెలుసుకోవాలని వాళ్లు వుంటున్న కాలనీకి బయలు దేరతారు. ఆ తరువాత ఏం జరిగింది? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.