English | Telugu
Karthika Deepam2 : జ్యోత్స్నకి క్లాస్ పీకిన కార్తీక్.. దీప హ్యాపీ!
Updated : Dec 12, 2025
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -538 లో....దీప చెప్పిన ఫుడ్ ట్రక్ ఐడియా బాగుందని అందరూ అనడంతో కార్తీక్ హ్యాపీ నెస్ తో స్వీట్ తీసుకొని వస్తాడు. అది ఓర్వలేక జ్యోత్స్న.. దీప మొదటి పెళ్లి గురించి మాట్లాడుతుంది. దాంతో సుమిత్ర కొట్టబోతుంటే నేను సమాధానం చెప్తానని కార్తీక్ అంటాడు. జ్యోత్స్న అసలు నీ ప్రాబ్లమ్ ఏంటి? ఒక ఆడది రెండో పెళ్లి చేసుకోవద్దన్న రూల్స్ ఉన్నాయా.. ఎవరైనా పరిస్థితికి కట్టుబడి ఉంటారు.
నేను దీపని పెళ్లి చేసుకోకున్నా కూడా నిన్ను చేసుకునేటోడిని కాదు. ఇప్పుడు నీకు నాతో ఎంగేజ్ మెంట్ వరకు వచ్చి క్యాన్సిల్ అయింది.. అలాగే గౌతమ్ విషయంలో కూడా అలాగే అయింది.. ఇప్పుడైనా నీకు పెళ్లి అవసరమా ఆని జనాలు అనుకున్నారనుకో నువ్వు చేసుకోకుండా మానేస్తావా.. లేదు కదా.. ఇప్పుడు పారు, తాత వాళ్ల పిల్లలు కోసం చేసుకున్నారు.. దాస్ మావయ్య తన భార్య జ్ఞాపకాలతో బ్రతికేస్తున్నాడు. అనసూయ గారు కూడా తన భర్త అంటే ఇష్టం కాబట్టి అలా ఉన్నారు. ఇకపోతే మా అమ్మనాన్న త్వరలో కలుస్తారని జ్యోత్స్నకి క్లాస్ తీసుకుంటాడు. కార్తీక్ కి పారిజాతం కూడా సపోర్ట్ చేస్తుంది. నువ్వు ఆడదాని మనసు అర్థం చేసుకున్నావ్ రా అని పారిజాతం అంటుంది. దీప నీ జీవితంలోకి రావడం నీ అదృష్టం అని పారిజాతం అనగానే నీ నోటి నుండి ఇలాంటి మాటలు వింటే స్వీట్ గా ఉంటుందని శివన్నారాయణ అంటాడు. నీకోసం ఏదైనా చెయ్యాలని అనిపిస్తుందని శివన్నారాయణ అనగానే మీ చేతిలో ఉన్న స్వీట్ తినిపించండి అని పారిజాతం అంటుంది. శివన్నారాయణ తినిపిస్తాడు. కార్తీక్ ఫోటో తీస్తాడు.
మరొకవైపు శ్రీధర్ తన పీఏ అయిన కాశీకీ ఫుడ్ ట్రక్ వెంట వెళ్ళమని చెప్తాడు. అ తర్వాత జ్యోత్స్న అన్నమాటలకి దీప బాధపడుతుంటే.. కార్తీక్ వెళ్లి మాట్లాడతాడు. జ్యోత్స్న ఇంకెప్పుడు అలా మాట్లాడకుండా చేసాను కదా అని కార్తీక్ అంటాడు. అ తర్వాత అక్కడికి వెళ్ళు ఇక్కడికి వెళ్ళు అంటూ కాశీకీ శ్రీధర్ కోపం తెప్పిస్తాడు. వీడిని నా కూతురు ఎలా పెళ్లి చేసుకుందో ఏంటోనని శ్రీధర్ ఆనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.