English | Telugu

దసరాకు అన్ స్టాపబుల్ సీజన్ 2 ?!

ఆహా ఓటిటి వేదికపై నందమూరి నాయకుడు అన్ స్టాపబుల్ షో కి హోస్ట్ గా చేసి ఆ షోకి మంచి రేటింగ్స్ తెచ్చిపెట్టారు. ఐతే ఈ షో ఫస్ట్ సీజన్ కంప్లీట్ చేసుకుంది. సెకండ్ సీజన్ ఎప్పుడు అంటూ ప్రేక్షకులు అడుగుతున్న ప్రశ్నలకు బాలయ్య తెలుగు ఇండియన్ ఐడల్ స్టేజి పై ఆన్సర్ ఇచ్చారు. ఫస్ట్ సీజన్ మోహన్ బాబుతో మొదలై మహేష్ బాబుతో ఎండ్ అయ్యింది. ఐతే బాలయ్య ఇప్పుడు సినిమాలు, పాలిటిక్స్ తో చాలా బిజీగా ఉన్నారు. ఇంత బిజీలోనూ షోస్ లో ఇంటర్వ్యూస్ చేస్తూ ఆడియన్స్ కి మరింత దగ్గరయ్యారు.

బాలయ్యలో మరో యాంగిల్ ని ప్రేక్షకులు "అన్ స్టాపబుల్ విత్ NBK " షోలో చూసారు. ఇంతకుముందు కనిపించిన బాలయ్య వేరు, ఇప్పుడు బాలయ్య వేరు . చాలా మార్పొచ్చింది. మాటతీరు కూడా చాలా బాగుంది అంటున్నారు అభిమానులు. ఈ షో రైట్స్ ని కొనుక్కోవడానికి చాలా ఛానెల్స్ కూడా ముందుకొస్తున్నాయి. యంగ్ జనరేషన్ తో కలిసి అద్భుతమైన షోస్ చేస్తున్నారనే టాక్ ఇండస్ట్రీలో నడుస్తోంది. ఇక ఇప్పుడు ఇండియన్ ఐడల్ స్టేజి మీద సింగర్, హోస్ట్ ఐన శ్రీరామచంద్ర అన్ స్టాపబుల్ సీజన్ 2 ఎప్పుడు అని బాలయ్యను అడిగారు. ఐతే ఈ షో బహుశా త్వరలోనే ప్రారంభం కావచ్చు అని చెప్పారు. ఆయన ఇచ్చిన ఆన్సర్ ని బట్టి దసరాకు ఈ షో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.