English | Telugu
టీం లీడర్ గా రోహిణి
Updated : Jun 14, 2022
ఎక్స్ట్రా జబర్దస్త్ ఎవ్రీ వీక్ చాలా కాంట్రోవర్సీస్ ని మూటగట్టుకుంటున్నా ప్రేక్షకులను చక్కగానే అలరిస్తూ వస్తోంది. ఐతే ఇప్పుడు ఈ షో స్టార్టింగ్ నుంచి ట్రావెల్ అవుతున్న చాలా మంది టీం లీడర్స్, టీమ్ మెంబర్స్, జడ్జెస్ వెళ్లిపోయారు. వాళ్ళ ప్లేస్ లో కొత్త వాళ్ళు వచ్చారు. కానీ అంత ఫన్ పండడం లేదని ఆడియన్స్ అభిప్రాయం. ఐనా కొత్త కొత్త స్కిట్స్ వేస్తూ ఎంతో కొంత రక్తి కట్టిస్తున్నారు. ఐతే రాబోయే ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. అందులో రోహిణి టీం లీడర్ అయ్యింది. ఇంతలో నరేష్ స్టేజి మీదకు వచ్చి అక్కడ భోజనాలు పెడుతున్నారంట అనేసరికి రోహిణితో సహా అందరూ పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఇక తర్వాత రోహిణి సీరియస్ అవుతుంది. ఏంట్రా మీరు నాతో పంచులేసేది. నాలో ఒక రోహిణినే చూస్తున్నారా. నాలో ఒక తెలంగాణ శకుంతల గారు, కోవై సరళ గారు, ఒక రమాప్రభ గారు వున్నారు. తెలుసా అనేసరికి అంతమంది లోపలున్నారా అందుకే అంత లావుగా ఉన్నావా వాళ్ళందరిని బయటికి పిలువ్ అంటూ రాంప్రసాద్ పంచ్ వేస్తాడు. ఇక ఈ షోకి ఇంద్రజ, ఎగిరే పావురమా హీరోయిన్ లైలా జడ్జెస్ గా వచ్చారు.
ఇక ఫైనల్ గా ఇంద్రజ బులెట్ భాస్కర్ ని ఆటో రాంప్రసాద్ ని ఇంటర్వ్యూస్ చేస్తారు. "మీ కో-లీడర్ ని మీరు తొక్కేయబట్టే ఆయన జబర్దస్త్ నుంచి వెళ్లిపోయారు అని అంటున్నారు దీనికి మీ సమాధానం" అంటూ భాస్కర్ ని అడుగుతుంది . మీరు స్క్రిప్ట్స్ సరిగా రాయకపోవడం వల్లనే మీ టీం మెంబెర్స్ ఈ షో నుంచి వెళ్లిపోయారు..అది నిజామా" అంటూ రాంప్రసాద్ ని అడుగుతారు. ఇలా రాబోయే వారం ఎక్స్ట్రా జబర్దస్త్ కొంచెం హాట్ గా కొంచెం కూల్ గా ఉండబోతోందని తెలుస్తోంది. మరి రాంప్రసాద్, భాస్కర్ ఏం ఆన్సర్స్ ఇచ్చారు అనే విషయం తెలుసుకోవాలంటే 17 వరకు వైట్ చేయాల్సిందే.