English | Telugu

సుమక్క టీ స్టాల్ కి వచ్చిన ‘విరాటపర్వం’ టీమ్‌

'విరాటపర్వం' ఈనెల 17న రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ బాగా జోరందుకున్నాయి. ఈ సందర్భంగా డైరెక్టర్ వేణు ఊడుగుల, న‌టుడు నవీన్ చంద్ర, హీరోయిన్ సాయి పల్లవి, ఆర్ట్ డైరెక్టర్ శ్రీనాగేంద్ర.. సుమక్క టీ స్టాల్ కి వచ్చి ఎంటర్టైన్ చేశారు. సుమక్క ఆల్వేస్ ఫన్నీ. సాయి పల్లవి కూడా ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూనే ఉంటుంది. "మా చాయ్ షాప్ కి మీ టీం అంతా ఇలా రావడం చాలా హ్యాపీగా ఉంది" అని చెప్తూనే టీ పెట్టమంటూ అక్కడ ఉన్న‌తనికి పురమాయిస్తుంది సుమ.. "గ్యాస్ ఆన్ చేయలేదుగా" అని సాయి పల్లవి అడిగేసరికి "మాది కనబడని గ్యాస్" అంటూ సుమ ఫన్ చేస్తుంది. "టీ కూడా కనపట్లేదుగా" అంటుంది మళ్ళీ పల్లవి. ఇంతలో స్టాల్ లోకి వేణు ఊడుగులవచ్చి కూర్చుంటారు. "ఏం టీ తాగుతారు మీరు?" అంటూ సుమ అడుగుతుంది.

"మసాలా టీ" అని వేణు చెప్పేసరికి దానికి రివర్స్ లో "వేపాకు టీ ఇవ్వు" అని చెప్తుంది సుమ. ఒక పేపర్ గ్లాస్ లో వేపాకులు వేసి ఇచ్చేసి "మా దగ్గర వేపాకులే ఉన్నాయి. టీ మీరు తెచ్చుకుని పోసుకుని తాగండి" అనేసరికి స్టేజ్ మొత్తం నవ్వులతో నిండిపోతుంది. స్పాంటేనియస్ కామెడీకి పెట్టింది పేరు సుమ. అలా సుమ హోస్ట్ చేస్తున్న 'క్యాష్' లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. అందులో ఈ చిన్న స్కిట్ మంచి నవ్వు తెప్పిస్తోంది.

డైరెక్టర్ గారు చెప్పారంటూ సాయిపల్లవితో స్టేజి మీద 'ఫిదా' మూవీలో సాంగ్ కి డాన్స్ చేయిస్తుంది సుమ. అసలే డాన్స్ క్వీన్ ఐన పల్లవి అంతే అందంగా డాన్స్ చేసి ఆడియన్స్ ని అలరించింది. ఈ వీడియోకి నెటిజన్స్ నుంచి బోల్డు మెస్సేజెస్ వస్తున్నాయి. 'సాయి పల్లవి సూపర్' అంటూ ఆమెను అలనాటి అందాల నటి సౌందర్యతో పోలుస్తున్నారు. మంచి నటి, మంచి డాన్సర్, సాయి పల్లవి చాలా ట్రెడిషనల్, సాయి పల్లవికి అందమైన మనసు ఉంది అంటూ కితాబిచ్చేశారు సాయిపల్లవి ఫాన్స్.