English | Telugu
షాట్ వేయమన్న శేఖర్ మాస్టర్... ముద్దు పెట్టిన రీతు
Updated : Aug 7, 2024
సినిమా ట్రైలర్ చూసి సినిమా మీద ఒక అంచనాకి వస్తాం.ఆ తర్వాత రిలీజ్ కోసం రీగర్ గా ఎదురుచూస్తుంటాం. అదే విధంగా ఇప్పుడు బుల్లి తెర షో కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్(kiraak boys khiladi girls)కోసం అందరు ఎదురుచూసే పరిస్థితి. తాజాగా ఆ షో కి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది. ఒక రేంజ్ లో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.
శ్రీముఖి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షో కి ప్రముఖ స్టార్ డాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్(sekhar master)అండ్ సినీనటి మాజీ జబర్దస్త్ ఫేమ్ అనసూయ(anasuya)లు జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. ఈ ఇద్దరకీ తెలుగు నాట ఉన్న క్రేజ్ గురించి అందరకి తెలిసిందే. ఒకరు కొరియోగ్రఫీ లో నెంబర్ వన్. ఇంకొకరు యాక్టింగ్ లో నెంబర్ వన్. అలాగే ప్రస్తుతం ఇద్దరి సినీ కెరీర్ మంచి ఊపు మీద ఉంది. ఇక ప్రముఖ సినీ అండ్ టివి రంగానికి చెందిన నటులు నటీమణులు ఈ షో లో పాల్గొనబోతున్నారు. కాకపోతే అందరు జోడీలుగా పాల్గొని రకరకాల గేమ్స్ ఆడతారు.ప్రోమో చూస్తుంటే ఆ విషయం అర్ధమవుతుంది. అలాగే ఎన్నో వెరైటీ గేమ్స్ తో పాటు వెరైటీ పంచులు కూడా ఉండబోతున్నాయని తెలుస్తుంది.
ఇక అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే శేఖర్ మాస్టర్ తో షో లో పాల్గొన్న ఒక కంటెస్ట్ మీ మనసులో ఎవరు లేరా అని అన్నాడు.దాంతో శేఖర్ మాస్టర్ తన మదిలో ఉంది రీతూ అని చెప్పాడు. రీతూ వెంటనే శేఖర్ మాస్టర్ దగ్గరకొచ్చి మాస్టర్ బుగ్గ మీద ముద్దు పెట్టింది. పైగా చాలా సిన్సియర్ గానే ముద్దు పెట్టింది. దీంతో ప్రోమోనే ఒక రేంజ్ లో ఉంటే ప్రోగ్రాం మొత్తం ఇంకెంత రేంజ్ లో ఉంటుందో అని బుల్లి తెర అభిమానులు మాట్లాడుకుంటున్నారు. రీతూ కొన్ని సినిమాలతో పాటు షోస్ చేసి మంచి పేరే సంపాదించింది. ఇప్పుడు ఈ షో లో కూడా కంటెస్ట్ చేస్తుంది.