English | Telugu
సుడిగాలి సుధీర్‌కి షాకిచ్చిన తారకరత్న
Updated : Dec 21, 2021
బుల్లితెరపై జబర్దస్త్ బ్యాచ్ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. కామెడీ చేస్తూనే డబుల్ మీనింగ్ డైలాగ్ లతో వీరు చేసే రచ్చ చాలా సందర్భాల్లో ట్రోలింగ్ కి గురైంది కూడా. ఈ షో లో సుడిగాలి సుధీర్ ది ప్రత్యేక శైలి. రష్మీతో గత కొన్నేళ్లుగా ఆన్ స్క్రీన్ లవ్ ట్రాక్ నడుస్తోంది. ఆఫ్ స్క్రీన్ కూడా వీరి మధ్య లవ్ నడుస్తోందని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు షికారు చేసిన విషయం తెలిసిందే. దీంతో సుడిగాలి సుధీర్ మరింతగా పాపులర్ అయ్యాడు.
Also read:రష్మీ గౌనుతో ఆది స్కిట్ అంటా?
ఇదిలా వుంటే ఈ పాపులారిటీనే సుడిగాలి సుధీర్‌ని తారకరత్న చేతిలో అడ్డంగా బుక్కయ్యేలా చేసింది. సుడిగాలి సుధీర్ టీమ్ ఎక్స్‌ట్రా జబర్దస్త్ తో పాటు `శ్రీదేవి డ్రామా సెంటర్`లోనూ తమదైన స్కిట్‌లతో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఈ షోకు హోస్ట్ గా ఇంద్రజ వ్యవహరిస్తుండగా టీమ్ సభ్యులుగా హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్ వ్యవహరిస్తున్నారు.
Also read:సిరికి దక్కింది ఎంతో తెలుసా?
ఈ షోకి గెస్ట్‌గా తారకరత్నని ఆహ్వానించారు. షోలోకి ఎంట్రీ ఇస్తూనే సుడిగాలి సుధీర్‌పై పంచ్‌లేశారు. `కొంచెం యాంకరింగ్ చేయండి సుధీర్ గారు` అన్నారు దీనికి రిప్లై ఇచ్చిన సుధీర్ తాను యాంకర్ ని కాదని, ఎంటర్‌టైనర్ ని అని వెంటనే చెప్పేశాడు. ఆ వెంటనే `సరే ఏదన్నా చేయండి` అని తారక రత్న షాకివ్వడంతో ఏంటీ ఈయన ఇలా తగులుకున్నాడని సుడిగాలి సుధీర్ బిత్తర చూసులు చూసిన తీరు నవ్వులు పూయిస్తోంది.
దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ నెల 26న ప్రపారం కానున్న ఈ ప్రొగ్రాం నవ్వులు కురిపించడం ఖాయం అని అంతా అంటున్నారు. ఈ ప్రోమోలో గెటప్ శ్రీను వేసిన తలైవా గెటప్, అతని హావభావాలు.. హిజ్రాల బాధల్ని తెలియజేస్తూ వేసిన స్కిట్ ఆకట్టుకుంటోంది.