English | Telugu

బిగ్ షాక్.. 'జ‌బ‌ర్ద‌స్త్'కు గుడ్ బై చెప్పిన సుడిగాలి సుధీర్!

బుల్లితెర ప్రేక్షకుల్లో సుడిగాలి సుధీర్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. కామెడీ షో 'జబర్దస్త్'లో కంటెస్టెంట్ గా వచ్చిన సుధీర్.. టీమ్ లీడర్ గా ఎదిగి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం పలు షోలు, సినిమాలతో సుధీర్ ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే 'జబర్దస్త్'తో ఇంత ఫేమ్ తెచ్చుకున్న సుధీర్.. ఇప్పుడు ఆ షో నుంచి బయటకు వచ్చాడని తెలుస్తోంది.

బుల్లితెరపై పలు పాపులర్ షోలను నిర్మించే మల్లెమాల సంస్థ ప్రతి సంవత్సరం జబర్దస్త్ కమెడియన్స్ తో అగ్రిమెంట్ చేయించుకుంటుదట. ఆనవాయితీ ప్రకారం ఈ ఏడాది కూడా కమెడియన్స్ తో అగ్రిమెంట్ పై సంతకాలు చేయించుకోవడానికి ప్రయత్నించగా.. అగ్రిమెంట్ పై సంతకం చేయడానికి సుధీర్ నిరాకరించార‌ట‌.

బుల్లితెరపై వచ్చిన క్రేజ్ తో వెండితెరపైనా వరుస ఆఫర్స్ పట్టేస్తున్నాడు సుధీర్. 'సాఫ్ట్ వేర్ సుధీర్'తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుధీర్.. గతంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో మెరిశాడు. ప్రస్తుతం హీరోగా రెండు సినిమాలు చేస్తున్న సుధీర్.. పలు సినిమాల్లో కీలక పాత్రలు చేస్తున్నాడు. ఇలా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సుధీర్ పూర్తిస్థాయిలో సినిమాలపై ఫోకస్ పెట్టాలన్న ఉద్దేశంతో 'జబర్దస్త్' షోని వదిలేస్తున్నట్లు తెలుస్తోంది. జబర్దస్త్ తో పాటు మల్లెమాల నిర్మిస్తున్న ఇతర షోలకు కూడా సుధీర్ దూరం కానున్నాడని ప్రచారం జరుగుతోంది.

'జబర్దస్త్' నుంచి సుధీర్ బయటకు వచ్చేస్తున్నాడన్న వార్త నిజమైతే అది ఆ షోకి బిగ్ షాక్ అనే చెప్పాలి. ఆ షోకి మంచి రేటింగ్ రావడానికి ప్రధాన కారణాల్లో సుధీర్ టీమ్ కూడా ఒకటి. ఇప్పుడు సుధీర్ బయటకు వచ్చేస్తే అతనితో పాటు అతని టీమ్ సభ్యులు గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ కూడా బయటకు వచ్చే అవకాశముందని టాక్ వినిపిస్తోంది.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.