English | Telugu
బోన్‌లో పెట్టాల్సింది నాగ్‌నా?
Updated : Nov 14, 2021
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5పై విమర్శల వర్షం కురుస్తోంది. గత సీజన్‌తో పోలిస్తే తాజా సీజన్ ఏమంత బాగాలేదని నెటిజన్స్ విమర్శలు చేస్తున్నారు. షో ప్రారంభం నుంచి కూడా నెటిజన్‌లతో పాటు ప్రేక్షకులు కూడా ఈ షో నిర్వహణ తీరుపై పెదవి విరుస్తూ ఓ రేంజ్‌లో విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఆ విమర్శలు ఈ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కింగ్ నాగార్జునని చుట్టుముడుతున్నాయి. నాగ్ బ్యాడ్ హోస్ట్ అని కొంత మంది దుమ్మెత్తిపోస్తుంటే, మరి కొంతమంది ఆయన డమ్మీ హోస్ట్‌గా మారిపోయారని విమర్శలు గుప్పిస్తున్నారు.
దీనికి ప్రధాన కారణం.. శనివారం ఎపిసోడ్‌లో నాగార్జున వ్యవహరించిన తీరు.. సన్నీపై విమర్శలు చేసిన తీరు నెటిజన్‌లకు ఆగ్రహాన్ని అసహనాన్ని తెప్పించింది. టాస్క్‌లో సన్నీని ఇబ్బందిపెట్టిన సిరిని.. ఆ తరువాత షణ్ముఖ్‌ని పక్కన పెట్టి కేవలం సన్నీని మాత్రమే టార్గెట్ చేస్తూ అతన్ని బోన్‌లో దోషిగా నిలబెట్టడం.. అతన్ని దారుణంగా విమర్శించడం నెటిజన్‌లకు ఆశ్చర్యాన్ని, ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. దీంతో బోన్‌లో పెట్టాల్సింది సన్నీని కాదు డమ్మీ హోస్ట్‌గా మారిన నాగ్‌ని అంటూ విమర్శలు చేస్తున్నారు.
టాస్క్‌లో భాగంగా సిరి, షణ్ముఖ్ రెచ్చగొట్టడం వల్లే సన్నీ రియాక్ట్ కావాల్సి వచ్చింది. ఇది వీడియోలో స్పష్టంగా వుంది. ఆ విషయాన్ని వదిలేసి నాగ్ కేవలం సిరిని అప్పడం.. ఇలాగే చేస్తే తంతా.. అప్పడాలు అమ్ముకో అంటే ముందుగా అమ్మేది నిన్నే అని సన్నీ అనడాన్ని తప్పుబట్టడం.. రెచ్చగొట్టి గొడవకు కారణమైన సిరి, షణ్ముఖ్‌లని ఏమీ అనకపోవడం నెటిజన్‌లకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. దీంతో షోనే కాదు.. హోస్ట్ నాగ్ కూడా దారి తప్పాడని .. ఆయన బ్యాడ్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారని ప్రేక్షకులు మండిపడుతున్నారు. ఈ సీజన్‌లో కంటెస్టెంట్‌గా పార్టిసిపేట్ ఎలిమినేషన్‌కు గురై బయటకు వచ్చిన ఉమాదేవి సైతం తన ఇన్‌స్టా స్టోరీలో నాగార్జున తీరును తప్పుపట్టడం గమనార్హం.