English | Telugu

సుధీర్‌కు పెళ్లి సంబంధాలు చూస్తున్న ఫ్యామిలీ.. మ‌రి ర‌ష్మి ప‌రిస్థితి?

'సుడిగాలి' సుధీర్, రష్మీ గౌతమ్ జంట ఈటీవీకి టీఆర్పీ పంట పండిస్తోంది. వాళ్ళిద్దరి లవ్ స్టోరీ మీద ఎన్ని స్కిట్స్, డాన్స్ పెర్ఫార్మన్స్, ఈవెంట్స్ చేసినా వ్యూవర్షిప్ దక్కుతోంది. దాంతో 'మా చెల్లికి పెళ్లి చేయాలి మళ్ళీ మళ్ళీ' అన్నట్టు... 'సుధీర్-రష్మీ పెళ్లి లేదంటే లవ్ స్టోరీ మీద చేయాలి మళ్ళీ మళ్ళీ ఈవెంట్' అన్నట్టు వ్యవహారం తయారవుతోంది.

గతంలో సుధీర్-రష్మీకి పెళ్లి చేస్తూ ఒక ఈవెంట్ చేశారు. రీసెంట్‌గా వినాయక చవితికి తొమ్మిదేళ్ల ప్రేమకు గుర్తుగా అంటూ రష్మీ చేత ఒక పెర్ఫార్మన్స్ చేయించారు. సుధీర్‌కి ఆమె చేత ప్రపోజ్ చేయించారు. 'మీ ఇద్దరి పెళ్లి ఎప్పుడు?' అని రోజా, ఇంద్రజ అడిగారు. అయితే, అదంతా టీవీ ప్రోగ్రామ్ కోసం చేసిందని 'గెటప్' శీను స్టేట్మెంట్ బట్టి అర్థమవుతోంది. సుధీర్, రష్మీ పెళ్లి చేసుకోరని అతడు కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు.

"సుధీర్, రష్మీ మధ్య ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ తప్పితే... ఆఫ్-స్క్రీన్ కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఏమీ లేవు. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోరు. ఇది నిజం. షూటింగ్ అయిపోయిన వెంటనే రష్మీది వేరే లోకం. ఆ లోకంలో ఉంటుంది. సుధీర్ కూడా అంతే! రియల్ లైఫ్‌లో వాళ్ళ మధ్య ఏమీ లేదు. వీలు కాదు కూడా! ఎందుకంటే... సుధీర్ కి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు" అని 'గెటప్' శీను చెప్పాడు. దాంతో రష్మీ కాకుండా సుధీర్ ఎవరోనని టీవీ ఆడియన్స్ లో ఆసక్తి మొదలైంది.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.