English | Telugu
ఆడిపాడే బొమ్మలమే కానీ.. స్టేజిపై ఏడ్చేసిన సునీత!
Updated : Apr 24, 2021
ఈ మధ్యకాలంలో బుల్లితెరపై ప్రసారమవుతోన్న షోలను బాగా ఎమోషనల్‌గా డిజైన్ చేస్తున్నారు. ఎమోషన్ ఎంతగా పండితే ఆడియన్స్ అంతగా షోకి కనెక్ట్ అయిపోతారు. అలా ఇప్పుడు డ్రామా జూనియర్స్ అనే షో ఎమోషన్‌ని బాగా పండిస్తోంది. ఈ షోకి సంబంధించిన ప్రోమోలు ట్రెండింగ్‌లో ఉంటున్నాయి. 'సరిగమప' షో అయిపోవడంతో ఆ షో స్థానంలో డ్రామా జూనియర్స్ అనే కొత్త షోను మొదలుపెట్టారు. టాలెంట్ ఉన్న చిన్నపిల్లలను తీసుకొచ్చి షో చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి జడ్జిలుగా సింగర్ సునీత, రేణు దేశాయ్, ఎస్వీ కృష్ణారెడ్డి లాంటి సెలబ్రిటీలను తీసుకొచ్చారు.
తాజాగా ఈ షోలో ఓ చిన్నారి వేసిన స్కిట్ చూసి చలించిపోయారు జడ్జిలు. సెలబ్రిటీలంటే అందరికీ వారిపై హక్కు ఉంటుందని ఫీల్ అవుతుంటారు. కొన్ని మీడియా సంస్థలు, వెబ్‌సైట్స్ లలో తారలపై రకరకాల రూమర్లు రాస్తుంటారు. ఇదే టాపిక్ తీసుకున్న చిన్నారి.. ఓ స్కిట్ వేసింది. అందులో ఆమె హీరోయిన్ కావాలని కలలు కని.. తన కలను నెరవేర్చుకుంటుంది. తండ్రి వద్దంటున్నా హీరోయిన్ అవుతుంది. అయితే మీడియా ఆమెపై రాసిన తప్పుడు వార్తల వలన తండ్రి విషం తాగి సూసైడ్ చేసుకుంటాడు.
ఈ స్కిట్ చూసిన సునీత తన ఎమోషన్‌ని కంట్రోల్ చేసుకోలేకపోయింది. స్టేజ్ మీదకు వచ్చి.. ''చాలా కనెక్ట్ అయిపోయాను.. మీకు మేం సెలబ్రిటీలం అవ్వొచ్చు. మీరు మమ్మల్ని ఏమైనా చేయొచ్చు.. సినిమాల్లో ఆడిపాడి బొమ్మలమే కానీ అమ్మలం రా..'' అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆ తరువాత రేణు దేశాయ్ కూడా ఏడ్చేసింది. దయచేసి తప్పుడు వార్తలు రాయొద్దంటూ వేడుకుంది.