English | Telugu

ఫ‌స్ట్ టైమ్ కూతురి ఫోటో షేర్ చేసిన హరితేజ!

బుల్లితెరపై సీరియల్స్ లో నటించడం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న హరితేజ.. ఆ తరువాత యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకుంది. అదే గుర్తింపుతో బిగ్ బాస్ సీజన్ 1లో కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశాన్ని దక్కించుకుంది. హౌస్ లో తనదైన స్టైల్ లో ఎంటర్టైన్మెంట్ పండించింది. ఆమె చెప్పిన హరికథ బిగ్ బాస్ షోకి హైలైట్ గా నిలిచింది. ఆ తరువాత ఈ బ్యూటీ చాలా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.

'సరిలేరు నీకెవ్వరు', 'ప్రతిరోజు పండగే', 'ఎఫ్ 2', 'అరవింద సమేత', 'యూటర్న్', 'శ్రీనివాస కళ్యాణం' ఇలా చాలా సినిమాల్లో నటించింది హరితేజ. ఇదిలా ఉండగా.. ఈ భామ ఏప్రిల్ 5న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మొదటిసారి తన చిన్నారిని సోషల్ మీడియా ద్వారా ఈరోజు పరిచయం చేసింది. పెళ్లిరోజు సందర్భంగా తమ కూతురి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. పాప రాకతో తమ వివాహ వార్షికోత్సవం మరింత ప్రత్యేకంగా మారిందని తెలిపింది.

భర్త దీపక్‌తో కలిసి బిడ్డను ఎత్తుకున్న ఫోటోను అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, నెటిజన్లు హరితేజకి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. హరితేజ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌. తనకు సంబంధించిన ప్రతీ విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. అలానే తన కూతురు ఫోటోని కూడా షేర్ చేసింది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.