English | Telugu
జీ తెలుగు కుటుంబం అవార్డ్స్.. శ్రియ-ఆంద్రీ లిప్ లాక్!
Updated : Oct 23, 2021
టీవీ సెలబ్రిటీలను ఒకచోటకు చేర్చే కార్యక్రమాల్లో జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ ఒకటి. జీ తెలుగు చానల్‌లో ప్రసారమయ్యే షోలకు సంబంధించి ఇచ్చే ఉత్తమ అవార్డులకు వేదిక ఈ వేడుక. సీరియల్స్‌లో, షోలలో కనిపించే తారలంతా ఈ అవార్డుల వేడుకలో మెరుపులు మెరిపిస్తుంటారు. అలాగే జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2021 వేడుకలోనూ వారంతా జిగేల్‌మనిపించన్నారు. టీవీ తారలే అలా ఉంటే, ఇక సినీ సెలబ్రిటీల సంగతి చెప్పేదేముంది! ఈ వేడుకలో ఎవర్‌గ్రీన్ హీరోయిన్ శ్రియ, ఆమె భర్త ఆంద్రీ కొశ్చేవ్ స్పెషల్ ఎట్రాక్షన్ కానున్నారు.
హోస్ట్ ప్రదీప్ మాచిరాజు ఎనౌన్స్ చేయగానే, "చిన్ని చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే" పాట బ్యాగ్రౌండ్‌లో వినిపిస్తుండగా ప్రత్యక్షమైన శ్రియ-ఆంద్రీ జంటను చూడగానే టీవీ తారలంతా సర్‌ప్రైజ్ అవుతూ చూసి, సంతోషంతో కేరింతలు కొట్టారు. రష్యన్ అయిన ఆంద్రీ "అందరికీ నమస్కారం" అని తెలుగులో చెప్పగానే అందరూ ఉత్సాహంగా ఈలలు వేశారు.
"ఇప్పటివరకూ ఆవిడ (శ్రియ) అకౌంట్‌లో పిక్చర్స్ చూస్తే ఏ పిక్చరూ ఇలా ఉండదు" అని ప్రదీప్ అనగా, శ్రియ-ఆంద్రీ పోజిచ్చారు. తన వీపుపై ఆంద్రీ చేయివేసి పట్టుకోగా, వెనక్కి వాలింది శ్రియ. ఆమె మెడ మీద చుంబించాడు ఆంద్రీ. శ్రియ నవ్వుతూ ఆంద్రీకి లిప్ టు లిప్ కిస్ ఇచ్చింది. ఆ తర్వాత ఇద్దరూ పగలబడి నవ్వుతూ గట్టిగా కౌగలించుకున్నారు. వారి దాంపత్య జీవితం ఎంత ఆనందంగా, సుందరంగా ఉందో వారి బాడీ లాంగ్వేజ్ తెలియజేసింది.
ఆ ఇద్దరి అన్యోన్యతను మరో గెస్ట్ తమన్నా కూడా ఎంజాయ్ చేసింది. ఈ సరదాల సంబరం ఈ రోజు సాయంత్రం 6 గంటలకు జీ తెలుగు చానల్‌లో ప్రసారమవుతోంది.