English | Telugu

"నా ల‌వ‌ర్‌కి పెళ్లయిపోతంది".. "ఎప్పుడో ఐపోయింది క‌దా".. సుధీర్‌కు ర‌ష్మి పంచ్‌!

సుడిగాలి సుధీర్‌, ర‌ష్మి గౌత‌మ్ కాంబినేష‌న్ అంటే ఆడియెన్స్‌కు ఎంత క్రేజో చెప్పాల్సిన ప‌నిలేదు క‌దా.. తొమ్మిదేళ్లుగా ఆ ఇద్ద‌రూ జంట‌గా బుల్లితెర‌పై ఎన్నిసార్లు క‌నిపించి అల‌రించారో! ఆడియెన్స్‌లో వాళ్ల‌కున్న ఇమేజ్‌ను చాన‌ల్స్‌, షోల నిర్వాహ‌కులు బాగా క్యాష్ చేసుకుంటూ ఉంటారు. అలా ఇద్ద‌రికీ ఓ షోలో పెళ్లి కూడా జ‌రిపించేశారు. లేటెస్ట్ ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్ షోలో సుధీర్‌కు ర‌ష్మి ఇచ్చిన పంచ్ అంద‌ర్నీ తెగ న‌వ్విస్తోంది. ఈ ఎపిసోడ్‌కు హీరో నిఖిల్ గెస్ట్‌గా అటెండ్ అయ్యాడు.

చేతిలో ఖాళీ మందు బాటిల్ ప‌ట్టుకొని, "ఐపోయింది రోజా గారూ.. నా ల‌వ‌ర్‌కి పెళ్ల‌యిపోతంది" అని బాధ‌ప‌డ్డాడు సుధీర్‌. "ఎప్పుడో ఐపోయింది క‌దా!" అని యాంక‌ర్ ప్లేస్‌లో ఉన్న‌ ర‌ష్మి అన‌డంతో షాక‌వుతూ ఆమె వంక చూశాడు. దాంతో రోజా స‌హా అంద‌రూ విర‌గ‌బ‌డి న‌వ్వేశారు.

నిఖిల్‌ను ఉద్దేశించి, "మీకేముంది.. హ్యాపీగా గాళ్ ఫ్రెండ్స్‌, లైఫ్‌లో అమ్మాయిలు.. బావున్నారు. నా ల‌వ‌ర్‌కి.. పెళ్లి.." అని సుధీర్ బాధ‌ప‌డుతుంటే, 'నాకా?' అన్న‌ట్లు ప్ర‌శ్నార్థ‌కంగా చూశాడు నిఖిల్‌. అంత‌లో రామ్‌ప్ర‌సాద్ ఎంట్రీ ఇచ్చాడు. అత‌డ్ని చూడ‌గానే, "రేయ్‌.. రాంప్ర‌సాద్‌.. ఐపోయిందిరా.. మొత్తం ఐపోయిందిరా" అని బాటిల్‌ను కింద పెట్టాడు సుధీర్‌. "ఐపోతే కొత్త బాటిల్ కొనుక్కుంటాం కానీ ఏడుస్తారేంట్రా!" కూల్‌గా అన్నాడు రాంప్ర‌సాద్‌, ఆ ఖాళీ బాటిల్‌ను ప‌ట్టుకుంటూ. అంతా న‌వ్వులే న‌వ్వులు.

"మందు ఐపోవ‌డం కాదురా.. నేను చ‌చ్చిపోతాను. నేనిక బ్ర‌త‌క‌ను. చ‌చ్చిపోతాను" అని సుధీర్ ఎమోష‌న‌ల్ అవుతుంటే, సీరియ‌స్‌గా "స‌రే అవ‌గానే ఫోన్ చెయ్" అని వెళ్ల‌బోయాడు రాంప్ర‌సాద్‌. ఈ హిలేరియ‌స్ ఎపిసోడ్ వ‌చ్చే శుక్ర‌వారం రాత్రి 9:30 గంట‌ల‌కు ప్ర‌సారం కానున్న‌ది.