English | Telugu

ఈ పెన్నుతో స‌న్నీది పొడుస్తావా, నాది పొడుస్తావా?.. కాజ‌ల్‌కు ర‌వి ప్ర‌శ్న‌!

బిగ్ బాస్‌లో త‌దుప‌రి కెప్టెన్ టాస్క్ సంద‌ర్భంగా హౌస్‌లో నానా గొడ‌వ జ‌రిగింది. ముఖ్యంగా విశ్వ‌, ప్రియాంక మ‌ధ్య పెద్ద ర‌గ‌డే జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. "ఏ ఒక్క పోటీదారుని బెలూన్ అయితే ప‌గ‌ల‌కుండా ఉంటుందో వారే బిగ్ బాస్ ఇంటి తదుప‌రి కెప్టెన్ అవుతారు." అని పేప‌ర్‌పై ఉన్న విష‌యాన్ని చ‌దివి వినిపించాడు శ్రీ‌రామ‌చంద్ర‌. "నేన‌వుతా ర‌వీ.. కెప్టెన్" అని యాంక‌ర్ ర‌వితో త‌న మ‌న‌సులో మాట చెప్పింది కాజ‌ల్‌. "సంపాదించు.. అడుక్కోకు" అని సూటిగా చెప్పేశాడు ర‌వి.

సైర‌న్ మోగ‌గానే అక్క‌డ చిన్న రౌండ్ స్టూల్ మీద పెట్టిన వ‌స్తువును అంద‌రికంటే ముందుగా తామే తీసుకోవాల‌ని అంద‌రూ ప‌రుగ‌లు తీశారు. దాన్ని ప‌ట్టేసుకున్నాడు విశ్వ‌. ఈ క్ర‌మంలో ప్రియాంక‌, లోబో కింద‌ప‌డిపోయారు. దీంతో విశ్వ‌తో గొడ‌వ పెట్టేసుకుంది ప్రియాంక‌. "ప్ర‌తి దానికీ నీకు కండ‌బ‌లం ఉంది.. అంద‌రికీ కండ‌బ‌లం లేదు క‌దా".. అని ప్రియాకం ఆర్గ్యూ చేయ‌డంతో, "ఏంటీ.. ఊరికే కండ‌బ‌లం అంటున్నావమ్మా" అని కోపంగా ప్ర‌శ్నించాడు విశ్వ‌.

"నీకు కండ‌బ‌లం లేదా? మ‌గోడికి ఒక‌ర‌కంగా ఉంటుంది, ఆడ‌దానికి ఇంకోర‌కంగా ఉంటుంది" అంది ప్రియాంక డిఫెండ్ చేసుకుంటూ. "మ‌గోడు, గిగోడు అని మాట్లాడ‌కు. నేను కంటెస్టెంట్." అని గ‌ట్టిగా వాదించాడు విశ్వ‌.

ఆ త‌ర్వాత కాజ‌ల్‌తో త‌న చేతిలోని పెన్నును చూపిస్తూ, "ఈ పెన్ను నీ చేతిలోకి వ‌స్తే, బెలూన్‌ది స‌న్నీది పొడుస్తావా, నాది పొడుస్తావా?" అన‌డిగాడు ర‌వి. అత‌డివైపే వెళ్లింది కాజ‌ల్‌.

"స‌రైన కార‌ణం చెప్పి క‌ట్ చేసేసెయ్. నో ప్రాబ్లెమ్‌" అని కాజ‌ల్‌తో అన్నాడు విశ్వ‌. "నువ్వు రెండు సార్లు కెప్టెన్‌గా చేశావ్ అంది" కాజ‌ల్‌. "టూ టైమ్స్ అనేది వ‌దిలేసేయ్‌. అది క‌ష్ట‌ప‌డినా" అన్నాడు విశ్వ‌.

ర‌వితో మాన‌స్ "చెప్పు రీజ‌న్ చెప్పు. సుగ‌ర్ కోటింగ్ వ‌ద్దు నాకు" అన్నాడు. "ఇదే రీజ‌న్‌.. డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్ దాకా నేనెందుకు తెచ్చుకుంటా".. అని ర‌వి ఇంకేదో అంటుంటే, త‌న బెలూన్‌ను త‌నే ప‌గ‌ల‌గొట్టేసుకున్నాడు మాన‌స్‌. ఆ త‌ర్వాత కాజ‌ల్ ఎందుకో ఏడుస్తుంటే, ప్రియ కౌగ‌లించుకొని ఓదార్చింది. బెలూన్ టాస్క్‌లో ఎవరు గెలిచి కెప్టెన్ అయ్యారో.. ఆ రోజు రాత్రి ఎపిసోడ్‌లో మ‌న‌కు తెలియ‌నుంది.