English | Telugu
మోనితలా మారిన శోభ.. కుట్రలు మళ్లీ షురూ
Updated : Jun 13, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `కార్తీక దీపం`. ఫ్యామిలీ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటూ విజయవంతంగా దూసుకుపోతోంది. ఈ సోమవారం కథ ఎలాంటి మలుపులు తిరుగుతోంది?.. ఎలాంటి ట్విస్ట్ లకు నాంది పలకబోతోంది అన్నది ఈ రోజు ఎపిసోడ్ లో చూద్దాం. ఎపిసోడ్ ప్రారంభంలో జ్వాల (శౌర్య).. నిరుపమ్ కు షాకిస్తుంది. ఎప్పటి నుంచో నీకు ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను `ఐ లవ్ యూ..` అంటుంది. ఆ మాటలకు నిరుపమ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అసలు నా గురించి ఏమనుకుంటున్నావు? అని అడుగుతాడు.
ఆ వెంటనే ఇంత లేటుగానా చెప్పడం అంటూ నవ్వేస్తాడు. నిరుపమ్ రియాక్షన్ చూసి జ్వాల సంతోషిస్తుంది. కట్ చేస్తే ఇదంతా జ్వాల ఊహ మాత్రమే. ఊహల్లోంచి బయటికి వచ్చి డాక్టర్ సాబ్ పేరు చెప్పగానే నా మనసు గాల్లో తేలిపోతూ వుంటుందని హిమతో చెబుతుంది. అంతే కాకుండా నిరుపమ్ ని నేను పెళ్లి చేసుకోవడం ఏంటీ? అని చిరాకు పడుతుంది. ఆ తరువాత జ్వాల, నిరుపమ్ లని హిమ ఒక చోట కలపాలని ప్లాన్ చేస్తుంది. అదే సమయంలో డాక్టర్ సాబ్ కు నా మనసులో మాట చెప్పేయబోతున్నానంటూ జ్వాల ఆనందాన్ని వ్యక్తం చేస్తూ వుంటుంది.
జ్వాల, నిరుపమ్ దగ్గరకు వెళ్లడానికి పూలతో ఏడు అడుగలని అలంకరిస్తుంది హిమ. చీర కట్టులో అందంగా ముస్తాబైన జ్వాల ఆ పూలపై నడుస్తూ నిరుపమ్ దగ్గరికి వెళుతూ వుంటుంది. అయితే నిరుపమ్ మాత్రం అయిష్టంగానే వుంటూ తన మనసు నిండ హిమనే వుందని, హిమని తప్ప ఎవరినీ పెళ్లి చేసుకోనని జ్వాలకు చెప్పాని నిరుపమ్ మనసులో అనుకుంటుంటాడు. కట్ చేస్తే జ్వాలకు ఎవరో ఫోన్ చేస్తే దీంతో వచ్చిన విషయాన్ని పక్కన పెట్టి జ్వాల అక్కడి నుంచి వెళ్లిపోతుంది. హిమ అడిగితే తన శత్రువు హిమ ఫోన్ చేసిందంటూ చెప్పడంతో హిమ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఫోన్ చేసింది శోభ.. మోనితలా మారి హిమ - జ్వాల మధ్య చిచ్చుకు ప్లాన్ చేయడం కొనమెరుపు.