English | Telugu
ఆర్య వర్ధన్ మైండ్ లో ఏముంది?
Updated : Jun 13, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `ప్రేమ ఎంత మధురం`. థ్రిల్లింగ్ కథాంశంతో రూపొందిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ఇది. ట్విస్ట్ లు, చిత్ర విచిత్రమైన మలుపులతో సాగుతూ మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఓ ఆత్మ పగా, ప్రతీకారం నేపథ్యంలో సాగుతున్న ఈ సీరియల్ గత వారం నుంచి చిత్ర విచిత్రమైన మలుపులతో సాగుతోంది. అనుని అడ్డం పెట్టుకుని తెలివిగా ఆర్య వర్ధన్ ని లాక్ చేస్తుంది రాగసుధ. గవర్నర్ కాన్వాయ్ కి అడ్డంగా నిలిచి ఆర్యని మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తుంది.
తను అనుకున్నట్టుగానే గవర్నర్ పోలీసులకు ఉత్తర్వులు జారీ చేయడంతో ఆర్య వర్థన్ ని పోలీసులు మూడు రోజుల పాటు కస్టడీకి తీసుకుంటారు. ఇది భరించలేని అను రాగసుధ వుంటున్న ఇంటికి వెళ్లి తన చెంపలు వాయించి హత్య చేసేంత పని చేస్తుంది. దీన్ని అడ్డం పెట్టుకుని ఆ దృశ్యాలని మీడియా క్యాప్చర్ చేసేలా చేస్తుంది. విషయం తెలిసి ఆర్య అక్కడి నుంచి అనుని వెళ్లిపొమ్మని చెబుతాడు. దీంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో అను అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
మూడు రోజుల కస్టడీకి అంగీకరించిన ఆర్య ఎలాంటి పనులు చేయకుండా, రాగసుధ ఆటకట్టించే ప్రయత్నాలేవీ చేయకుండా సైలెంట్ అయిపోతాడు. ఇంతకీ ఆర్య మైండ్ లో ఏముంది? .. రాగసుధ రెచ్చిపోతున్నా ఆర్య మౌనం వహించడానికి వెనకున్న మతలబేంటీ? ..ఏం ప్లాన్ చేయబోతున్నాడు? ఇప్పటికే ఆ ప్లాన్ ని మొదలు పెట్టాడా? .. ఏం జరగబోతోంది? అన్నది మాత్రం సస్పెన్స్. అదేంటో తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.