English | Telugu
సెల్ఫీలు దిగేంత మొహం నాది కాదు!
Updated : Jun 13, 2022
ఫైమా జబర్దస్త్ లో అప్ కమింగ్ కమెడియన్. జబర్దస్త్ షోలో మూతి, ముక్కు వంకర్లు తిప్పుతూ ఒక రకమైన కామెడీని పండిస్తూ అలరిస్తోంది. కానీ ఫైమా ఒకప్పుడు ఎంతో పేదరికాన్ని అనుభవించింది. నాకు ఐదు, పది రూపాయలు కావాలంటే మా అమ్మ బీడీలు చుట్టి అవి అమ్మి ఆ డబ్బులు ఇచ్చేది. అన్ని కష్టాలు పడిన నాకు ఈ జబర్దస్త్ షో నాకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఇచ్చింది. మా ఇంట్లో టీవీ ఉండేది కాదు. ఎవరైనా మా ఇంటి అడ్రస్ అడిగినా సరిగా చెప్పలేకపోయేవాళ్లు.
కానీ ఇప్పుడు పరిస్థితి అంతా తారుమారయ్యింది. సెల్ఫీలు తీసుకునేంత మొహం నాకు లేకపోయినా నాతో సెల్ఫీలు దిగుతున్నారు. ఇంటి అడ్రస్ అడుగుతుంటే మా ఇంటి పక్కనే అని చెప్పుకుంటున్నారు. నిజంగా నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. బులెట్ భాస్కర్ అన్న నాకు మంచి లైఫ్ ఇచ్చాడు. నాతో కామెడీ షో ఎలా చేయాలో ట్రైనింగ్ ఇచ్చాడు. ఇప్పుడు నాకొచ్చిన పేరు చూసి మా అమ్మా నానా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎప్పటికైనా మా అమ్మకు ఇల్లు కట్టి ఇవ్వాలన్నదే నా కోరిక అంటూ ఫైమా ఒక ఇంటర్వ్యూ లో తన మనసులో మాట చెప్పింది.