English | Telugu

రాకేష్‌తో రిలేష‌న్‌షిప్‌పై రోహిణి ఏం చెప్పిందంటే..!

'జబర్దస్త్' వీక్షకులకు ఫిమేల్ ఆర్టిస్ట్ రోహిణి సుపరిచితురాలు. బుల్లితెరపై దూసుకువెళ్తున్న తార‌ల్లో ఆమె ఒకరు. లేటెస్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాన్స్‌తో చాట్ చేశారు. రాకేష్‌తో రిలేషన్షిప్, 'బిగ్ బాస్'లో తన సపోర్ట్ తదితర అంశాల గురించి ఓపెన్ అయ్యారు. ఫాలోవ‌ర్స్ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు త‌న‌దైన స్టైల్‌లో ఆమె ఆన్స‌ర్లు ఇచ్చారు.

* అక్కా... మీరు శ్రీదేవి డ్రామా కంపెనీలో రావడం లేదు. ఎందుకు?
ఆ రెండు ఎపిసోడ్స్ లో లేను. నెక్స్ట్ నుండి వస్తా.

* 'బిగ్ బాస్ 5'లో మీ సపోర్ట్ ఎవరికి?
సన్నీ భాయ్.

* ఎందుకు సన్నీని సపోర్ట్ చేయాలని అనుకుంటున్నారు?
అతను నా బెస్ట్ ఫ్రెండ్. ఫ్యామిలీ లెక్క. మంచి అయినా, చెడు అయినా అతనికి అండగా నిలబడతా.

* 'బిగ్ బాస్'లో ఫస్ట్ సన్నీ అయితే సెకండ్ ఎవరికీ సపోర్ట్ చేస్తారు?
విశ్వ, యాంకర్ రవి, సిరి హనుమంతు.

* సీరియల్ చేస్తానని అన్నారుగా. స్టార్ట్ అయ్యిందా?
డేట్స్ ప్రాబ్లమ్ వల్ల క్యాన్సిల్ అయ్యింది. మళ్ళీ మంచి సీరియల్ తో రావాలని ఆశిస్తున్నా.

* హాలీవుడ్ లో ఎందుకు ట్రై చెయ్యట్లేదు?
మన ఇంట్లో ఫ్రైలు చేసుకోవాలి కానీ అలాంటివి ట్రై చేయకూడదు.

* మీరు, రాకేష్ రిలేషన్ లో ఉన్నారా?
నో వే. అంటే... అటువంటి అవకాశమే లేదు అన్నట్టు.

* మీది, సుధీర్ ది ఫొటో. ఇప్పటివరకూ ఎవరూ చూడనిది.
అంత అన్‌సీన్ పిక్స్ ఏమీ దిగలేదు.