English | Telugu
రెండు కొత్త క్యారెక్టర్లు.. శౌర్య, హిమలకు బావలు వచ్చారు!
Updated : Sep 29, 2021
రోజుకు ఒక మలుపుతో 'కార్తీక దీపం' సీరియల్ కొత్త దారుల్లో పయనిస్తోంది. మోనిత జైలుకు వెళ్లిందన్న మాటే గానీ కార్తీక్ కుటుంబంలో ఎవరికీ సుఖం లేకుండా చేస్తోంది. మోనిత చేస్తున్న పనులకు కార్తీక్, దీప దంపతులకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. మరోవైపు తండ్రిని దోషిలా చూడటమే కాదు, మోనితను నిజంగా తమ తండ్రి మోసం చేశాడని కార్తీక్ పిల్లలు బాధపడుతున్నారు. ఇప్పుడు కథంతా తండ్రి, పిల్లల చుట్టూ తిరుగుతోంది. మరింత ఆసక్తికరంగా మారుతోంది.
స్కూల్ ఫ్రెండ్ షైనీ చెప్పింది నిజమా? కదా? అని తండ్రిని పిల్లలు హిమ, శౌర్య నిలదీయడంతో 'ఆయన (కార్తీక్) ఏ తప్పూ చేయలేదు. అంత ప్రేమ చూపించే తండ్రి మీద మీకు కోపం ఏంటి? పంతం ఏమిటి?' అని దీప చెప్పడంతో పిల్లలు మామూలు అవుతారు. అయితే, మరుసటి ఉదయం పేపర్ చూసి కార్తీక్ మళ్లీ తలపట్టుకుంటాడు, షాక్ అవుతాడు.
'నా బిడ్డకు తండ్రి అతనే... ఓ డాక్టర్ వింత ప్రేమకథ' హెడ్డింగ్ తో ఓ పత్రికలో మోనిత రాసిన వెర్షన్ కథగా ప్రచురితమై ఉంటుంది. అందులో తన పేరు చివరన కార్తీక్ చేరాక ఆనందం వచ్చిందని, తన జీవితంలో ఉత్తేజం వచ్చిందని మోనిత రాసుకొస్తుంది. కార్తీక్ బిడ్డకు తల్లి కాబోతున్నందుకు గర్వంగా ఉందని అంటుంది. 'ప్రేమకు హద్దులు చెరిపేశా. కొత్త నిర్వచనం ఇచ్చా. నా ప్రేమను గెలిపించుకోవడానికి ఏ పరీక్షకైనా సిద్ధమే. దీపక్క మొగుడు కార్తీకే నాకు పుట్టబోయే బిడ్డకు తండ్రి' అని పత్రికలో రాసిన కథలో మోనిత చెబుతుంది. తరువాత సంచికలో మోనిత ఎవరు? కార్తీక్ ఎవరు? అనేది చదవమని, చదివించమని పాఠకులను కోరుతుంది.
ఆ పేపర్ చదివి కార్తీక్ షాక్ అవుతాడు. దీప కన్నీళ్లు పెట్టుకుంటుంది. పిల్లలకు కనిపించకుండా పరుపు కింద పేపర్ పెడుతుంది మోనిత. డబ్బుల కోసం పిల్లలు పరుపు కింద చూడటంతో ఆ పేపర్ వాళ్ల కంట కనబడుతుంది. దాంతో నిజంగా తండ్రి మోసం చేశాడని మరోసారి బాధపడతారు.
మోనిత మేటర్ పక్కన పెడితే... కార్తీక్ కుటుంబంలో మరో రెండు కొత్త క్యారెక్టర్లు ఎంట్రీ ఇచ్చాయి. సౌందర్య కుమార్తె పిల్లలుగా ఇద్దరు అబ్బాయిలు ప్రేమ్, నిరుపమ్ తెరపైకి వచ్చారు. కార్తీక్ పిల్లలు హిమ, శౌర్యకు వాళ్ళు బావ వరుస అన్నమాట. వీళ్ళ మధ్య ప్రేమకథలు నడుపుతారేమో చూడాలి.