English | Telugu
నాగార్జున గుంటనక్క అంటుంటే అందరూ నావైపే చూస్తున్నారు!
Updated : Sep 29, 2021
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని అంటారు. టీవీ షోల్లో పార్టిసిపేట్ చేసే కంటెస్టెంట్లకు కూడా సేమ్ ఫార్ములా అప్లై అవుతుందని అనుకోవాలేమో! 'బిగ్ బాస్'లో ఈరోజు కలిసిమెలిసి ఉన్నోళ్ళు... రేపు మాటల కత్తులు దూసుకుంటున్నారు. మరునాడు మళ్లీ కలుస్తున్నారు. షోలో అటువంటి దృశ్యం ఒకటి చోటు చేసుకుంది.
ప్రియను నామినేట్ చేస్తూ లోబో గట్టిగా అరిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమె వెక్కి వెక్కి ఏడ్చింది. యాంకర్ రవి 'తప్పు మన వైపు ఉన్నప్పుడు మనమే వెళ్లి సారీ చెప్తే పెరుగుతాం' అని సలహా ఇవ్వడంతో... ప్రియ దగ్గరకు వెళ్ళిన లోబో ఆమెకు హగ్ ఇచ్చాడు. ఆమె నార్మల్ అయినట్టే అనిపించింది.
మరోవైపు గతవారం తనను ఏడిపించిన రవి దగ్గరకు ప్రియా వెళ్ళింది. 'ఇక నార్మల్ అయిపో. అయిపోయింది ఏదో అయిపోయింది' అని ఓదార్చే ప్రయత్నం చేసింది. 'బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నా. నాతో నాకే ఫైట్' అని రవి చెప్పాడు. మొత్తం మీద తన రెండు నాల్కల ధోరణి బయటపడడంతో బాగా ఫీల్ అయినట్టు వున్నాడు. నటరాజ్ మాస్టర్ దగ్గర 'నాగార్జునగారు గుంటనక్క అంటుంటే అందరూ నావైపే చూస్తున్నార'ని బాధపడ్డాడు.