English | Telugu
సూసైడ్ వరకూ వెళ్లిన 'జబర్దస్త్' కమెడియన్!
Updated : Sep 1, 2021
ఒక టైమ్‌లో 'జబర్దస్త్'లో తనను టీమ్ లీడర్‌గా తీసేశారని, అప్పుడు సూసైడ్ వరకూ వెళ్లానని 'రాకింగ్' రాకేష్ చెప్పాడు. కారు వేసుకొని వెళ్లి కావాలని చెట్టుకు గుద్దేశానని వివరించాడు. అయితే, 'చలాకి' చంటి వల్ల తాను ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నానని చెప్పుకొచ్చాడు.
"నన్ను టీమ్ లీడర్‌గా తీసేసిన సమయంలో చంటి అన్న తన టీమ్‌లోకి నన్ను తీసుకున్నాడు. నాకు ఆత్మస్థైర్యాన్ని ఇచ్చాడు. ఇప్పుడు నేను టీమ్ లీడర్‌గా ఉన్నానంటే... నాకు ఎప్పటికీ చంటి అన్న గుర్తు ఉంటారు" అని 'శ్రీదేవి డ్రామా కంపెనీ' కార్యక్రమంలో 'రాకింగ్' రాకేష్ చెప్పాడు. అతను ఈ విషయం చెబుతుంటే ఇంద్రజ, సంగీత దర్శకుడు కోటి, తోటి నటులందరూ కదిలిపోయారు. టీచర్స్ డే సందర్భంగా సెప్టెంబర్ 5న ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది.
'శ్రీదేవి డ్రామా కంపెనీ' ప్రతి ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఈటీవీలో ప్రసారం కానున్న సంగతి తెలిసిందే. ఈ ఆదివారం టీచర్స్ డే కావడంతో 'ఆచార్యదేవోభవ' పేరుతో స్పెషల్ ఎపిసోడ్ చేశారు. దీనికి కోటి ప్రత్యేక అతిథిగా విచ్చేశారు. ఆల్రెడీ రిలీజైన ప్రోమో చూస్తుంటే... 'అదిరే' అభి, విష్ణుప్రియ వేసిన డాన్స్, మిగతావాళ్లు పంచ్ డైలాగులు ఆకట్టుకునేలా ఉన్నాయి. రామ్ ప్రసాద్ తన గురువు అని బాబు అంటుంటే... రామ్ ప్రసాద్ వద్దని చెప్పడం హైలైట్.