English | Telugu

కామెడీ స్టార్స్ ధ‌మాకాలో నాగ‌బాబు డిసిప్లిన్ ర‌చ్చ‌

బుల్లితెర‌పై ఆక‌ట్టుకుంటున్న కామెడీ షో `కామెడీ స్టార్స్ ధ‌మాకా`. `స్టార్ మా`లో మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు రీ ఎంట్రీతో ఈ ప్రోగ్రామ్ రూపురేఖ‌ల్నే మార్చేశారు. ముందు కామెడీ స్టార్స్ గా మొద‌లైన ఈ షో మెగా బ్ర‌ద‌ర్ ఎంట్రీతో కామెడీ స్టార్స్ ధ‌మాకా మారిపోయింది. శేఖ‌ర్ మాస్ట‌ర్ తో క‌లిసి జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రిస్తున్న శ్రీ‌దేవి వెళ్లిపోయింది. ఆ ప్లేస్ లో నాగ‌బాబు వ‌చ్చేశారు. అంత‌కు ముందు యాంక‌ర్ గా వ‌ర్షిణి సౌంద‌ర‌రాజ‌న్ వుండేది.. ఆ త‌రువాత శ్రీ‌ముఖి వ‌చ్చి చేసింది. ఇప్పుడు ఆ ప్లేస్ లో దీపిక పిల్లిని షోలోకి తీసుకొచ్చారు. గ‌త కొన్ని వారాలుగా విజ‌య‌వంతంగా ఈ షో సాగుతోంది.

అయితే ఈ ఆదివారం మాత్రం ఈ షో కొత్త మ‌లుపు తిరగ‌బోతోంది. జ‌బ‌ర్ద‌స్త్‌, ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షోల‌ని డామినేట్ చేయాల‌నే ప్ర‌ధాన ఉద్దేశ్యంతో ఈ షోని పునః ప్రారంభించారు. అయితే ఈ షోలో కంటెస్టెంట్ ల మ‌ధ్య డిసిప్లిన్ లేద‌ని నాగ‌బాబు గ‌మ‌నించారో ఏమోగానీ దాన్ని సెట్రెట్ చేసే కార్య‌క్ర‌మాన్నే ఈ ఆదివారం ఎపిసోడ్ కింద పెట్టుకున్నారు. ఇందు కోసం స్వ‌యంగా రంగంలోకి దిగిన నాగ‌బాబు బెత్తం ప‌ట్టుకుని ఓ రేంజ్ లో కంటెస్టెంట్ ల‌ని చిత‌కబాదేశారు.

ముక్కు అవినాష్ ని అయితే ఓ రేంజ్ లో తొడ‌పాశం పెడుతూ ర‌చ్చ ర‌చ్చ చేశారు. నిస్ప‌క్ష‌పాతంగా జ‌డ్జిమెంట్ ఇవ్వాలంటే ఇందుకు కంటెస్టెంట్ ల‌లో డిసిప్లిన్ కావాలి.. అది రావాలి అంటే మ‌నం ఏం చేయాలి అంటూ చేతిలో వున్న బెత్తానికి ప‌ని చెప్పారు. దీంతో కంటెస్టెంట్ లు ఆర్త‌నాదాలు చేస్తూనే కామెడీని పండించ‌డంతో అక్కడున్న మిగ‌తావారు న‌వ్వుల్లో మునిగిపోయారు. ఇక్క‌డో ముఖ్య‌మైన విష‌యం ఏంటంటే నాగ‌బాబు స్వ‌యంగా కంటెస్టెంట్ ల మ‌ధ్య చిచ్చు పెట్టి మ‌రీ ఒక‌రిని ఒక‌రు కొట్టుకునేలా చేయ‌డం. ఓ విధంగా నార‌దుడిలా మారిన నాగ‌బాబు ఒక‌రిపై ఒక‌రికి చాడీలు చెప్పేసి రివేంజ్ ని ప్లాన్ చేసి మ‌రీ కంటెస్టెంట్ ల వీపు విమానం మోత‌మోగించారు. ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట సంద‌డి చేస్తోంది. ఈ ఎపిసోడ్ ఈరోజే స్టార్ మాలో ప్రసారం కావడం విశేషం.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.