English | Telugu
ఈ రోజు నుంచి `కార్తీకదీపం` కొత్త కథ షురూ
Updated : Mar 21, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న పాపులర్ సీరియల్ `కార్తీక దీపం`. గత కొంత కాలంగా టాప్ రేటింగ్ తో టాప్ లో నిలిచిన ఈ సీరియల్ ని మలయాళంలో వంటలక్క ప్రేమి విశ్వనాథ్ నటించిన `కరుతముత్తు` ఆధారంగా తెలుగులో రీమేక్ చేశారు. 2014లో మొదలైన ఒరిజినల్ సీరియల్ 2019 ఆగస్టులో ఎండ్ అయింది. ఇక తెలుగులో 2017 అక్టోబర్ లో ఈ సీరియల్ ని ప్రారంభించారు. ప్రస్తుతం తెలుగుతో పాటు ఏడు భాషలలో ఈ సీరియల్ రీమేక్ వెర్షన్ కంటిన్యూ అవుతోంది.
సోమవారం ఈ సీరియల్ కొత్త వెర్షన్ ప్రారంభం కాబోతోంది. పిల్లుల పెద్దవాళ్లు గా మారబోతున్నారు. హిమ, శౌర్య ల నేపథ్యంలో సీరియల్ ని కంటిన్యూ చేస్తున్నారు. హిమ చివరికి ఇంటికి రావడంతో తను ఇంట్లో వుంటే నేను వుండనని శౌర్య ఇంటి నుంచి బయటికి వెళ్లిపోతుంది. శౌర్య గురించి సౌందక్య, ఆనందరావు, హిమ టెన్షన్ పడుతుంటారు. అయితే శౌర్య గదిలో లెటర్ వుందని ఆదిత్య చెబుతాడు. ఆ లెటర్ లో `అమ్మా నాన్నలని చంపిన హిమ తో కలిసి నేను ఇంట్లో వుండనని` ఉంటుంది.
దీంతో అంతా శౌర్యని వెతకడం మొదలుపెడతారు. కానీ ఇంటి నుంచి బయటికి వచ్చిన శౌర్యకు ఎటు వెళ్లాలో అర్థం కాదు. దీంతో అటుగా వెళుతున్న ఓ వ్యక్తిని లిఫ్ట్ అడుగుతుంది. ఇదే క్రమంలో గతంలో జరిగిన యాక్సిడెంట్ గుర్తుకు రావడంతో హిమ పై మరింతగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. కట్ చేస్తే తనకు లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తం దొంగ అని తెలిసి అతనికి క్లాస్ పీకుతుంది శౌర్య. అయినా అతడిలో మార్పు కనిపించకపోవడంతో అతనిపై అతనిపై రాయితో దాడి చేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అనాధ పిల్లలు కపిపించడంతో వారితో కలిసిపోతుంది. ఈ లోగా హిమని కాపాడిన చంద్రమ్మ ఓ షాపులో దొంగతనం చేస్తుండగా శౌర్య పట్టుకుని బెదిరిస్తుంది. తన వద్ద వున్న డబ్బులు లాక్కుని అనాధలకు ఇచ్చేస్తుంది.
కట్ చేస్తే హిమ, శౌర్య ఇద్దరూ పెద్ద వాళ్లవుతారు. హిమ ఇంట్లో వుండి డాక్టర్ అవుతుంది. శౌర్య మాత్రం ఎక్కడో వుంటూ ఆటోడ్రైవర్ గా జీవనం సాగిస్తూ వుంటుంది. ఈ ఇద్దరూ ఓ యాక్సిడెంట్ కారణంగా కలిసినట్టుగా ప్రోమోలో చూపించాడు దర్శకుడు.. ఈ రోజు కథని దర్శకుడు ఎటు తిప్పబోతున్నాడు? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.