English | Telugu

హీరోయిన్ రేఖకి ఏమయ్యింది ?

ఆనందం మూవీ 2001 లో సూపర్ డూపర్ హిట్ కొట్టిన విషయం అందరికీ తెలిసిందే. అందులో హీరోయిన్ రేఖ కూడా అందరికీ పరిచయమే. ఆమె ఈ మూవీతోనే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆకాష్‌ హీరోగా శ్రీను వైట్ల డైరెక్షన్ లో వచ్చిన మూవీ హిట్ కొట్టింది. `జాబిలి` మూవీలో అలాగే నందమూరి తారకరత్నతో `ఒకటో నెంబర్‌ కుర్రాడు` మూవీలో నటించింది. ఆ తర్వాత `జానకి వెడ్స్ శ్రీరామ్‌`లో మెరిసింది. ఆ తర్వాత నుంచి రేఖ ఫేట్ మారిపోయింది. అవకాశాలు తగ్గాయి. పెద్దగా సక్సెస్ లు రాలేదు. దాంతో కన్నడ ఇండస్ట్రీకి పరిమితమై అక్కడే వరుసగా మూవీస్ చేస్తూ స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది.

రేఖ తెలుగులో నటించిన చివరి చిత్రం 2008లో విడుదలైన `నిన్న నేడు రేపు`. ఇక పదిహేనేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ బుల్లితెర మీద మెరుస్తోంది. `అలీతో సరదాగా` షోలో పాల్గొనే తాను తెలుగులోకి రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నట్టు చెప్పింది. బొద్దుగా , అందంగా ఉండే ఈ బ్యూటీ ఇప్పుడు బక్కచిక్కి రూపు రేఖలు లేకుండా అసలు రేఖానా అనేలా ఉంది. తాజాగా `శ్రీదేవి డ్రామా కంపెనీ` షోలో మెరిసింది. అనారోగ్యంతో బాధపడుతున్న పేషెంట్‌లా మారిపోయింది. రావడంతోనే షోలో బుల్లెట్‌ భాస్కర్‌పై పంచ్‌లేసి నవ్వులు పూయించింది.

ఇంద్రజ ఆమె గురించి అడిగింది. సడెన్‌గా ఇలా జరిగిందని చెప్పింది రేఖ. ఐతే ఏం జరిగిందనేది మాత్రం ఆదివారం ఎపిసోడ్ లో తెలియనుంది. ఏం జరిగిందనేది తెలియాలంటే మరో మూడు రోజులు ఆగాల్సిందే. రేఖ తెలుగులో `ఆనందం`, `ఒకటో నెంబర్‌ కుర్రాడు`, `మన్మథుడు` , `జీనియస్‌` మూవీస్ లో స్పెషల్‌ రోల్స్ లో కనిపించగా `దొంగోడు`, `అనగనగా ఒక కుర్రాడు`, `జానకి వెడ్స్ శ్రీరామ్‌`, `ప్రేమించుకున్నాం పెళ్లికి రండి`, `నాయుడమ్మ`, `నిన్న నేడు రేపు` చిత్రాల్లో నటించింది. 2014 నుంచి సినిమాలకు దూరంగా ఉన్న రేఖ 9ఏళ్లు కనిపించకుండా పోయి మూడేళ్ల క్రితం అలీ షోలో మెరిసింది. ఆ తర్వాత మళ్ళీ మాయమైపోయి ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో కనిపించింది.