English | Telugu
జగతికి రిషి కన్నీటి వీడ్కోలు.. శైలేంద్రే కపటసూత్రధారి!
Updated : Oct 5, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ గుప్పెడంత మనసు. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-885 లో... రిషి, వసుధారల పెళ్ళిని జగతి దగ్గరుండి జరిపిస్తుంది. పెళ్ళి తర్వాత రిషి, వసుధారలు జగతి ఆశీర్వాదం తీసుకుంటారు. అలా ఆశీర్వదించిన జగతి ఒక్కసారిగా కుప్పకూళిపోతుంది. దాంతో అందరు షాక్ అవుతారు. ఏం జరిగిందోనని డైలామాలో అందరూ ఉంటారు. అప్పుడే నర్స్ ని పిలిచి చూడమంటాడు రిషి. జగతి పల్స్ చూసిన నర్స్.. చనిపోయిందని చెప్తుంది.
దాంతో రిషి, వసుధారలతో పాటుగా మహేంద్ర, ఫణీంద్ర, ధరణి, చక్రపాణి షాక్ అవుతారు. శైలేంద్ర, దేవయాని మాత్రం హ్యాపీగా ఉంటారు. అసలు వీళ్ళెందుకు హ్యాపీగా ఉన్నారంటే.. అంతకముందు జగతి చనిపోవడానికి జ్యూస్ లో ట్యాబ్లెట్ ని కలుపుతాడు శైలేంద్ర. ఇక ఎవరికి డౌట్ రాకుండా ఆ జ్యూస్ ని నర్స్ తో ఇప్పిస్తారు శైలేంద్ర, దేవయాని. అందుకని ఆ జ్యూస్ తాగిన జగతి చనిపోతుంది. శైలేంద్ర, దేవయానిల ప్లాన్ సక్సెస్ అయ్యినందుకు ఇద్దరు సంతోషంగా ఉంటారు. బయటకు మాత్రం బాధలో ఉన్నట్టు నటిస్తారు. ఇక చనిపోయిన జగతిని చూసి రిషి ఏడుస్తాడు. " లే అమ్మా.. నువ్వు చనిపోలేదు.. ఎవరు చనిపోయిందని అనకండి" అంటూ రిషి ఏడుస్తుంటే తనని వసుధార ఓదార్చుతుంది. మరొకవైపు మహేంద్ర కూడా తనకి అలా జరిగినందుకు కన్నీటి పర్యంతం అవుతాడు. ఆ తర్వాత జగతిని శ్మశానానికి తీసుకెళ్ళేముందు స్నానాలవి చేపిస్తుంటే.. తన దగ్గరికి జగతి వచ్చి మాట్లాడినట్టు రిషి ఊహించుకుంటాడు.
నన్ను ఒదిలేసి వెళ్ళిపోయావా అమ్మా అంటు జగతిని రిషి అడుగగా.. లేదు నాన్న.. నువ్వు నన్ను అమ్మ అన్నావ్ ఆ తృప్తి చాలు అని జగతి అంటుంది. నువ్వు మాతో ఉండు అమ్మ అంటూ జగతితో అనగానే.. ఏం అయింది సర్ అని వసుధార అంటుంది. మా అమ్మ నన్ను విడిచి వెళ్ళిపోయింది వసుధార అంటూ రిషి కంటతడి పెట్టుకుంటాడు. ఇక వసుధార ఓదార్చుతుంది. శైలేంద్ర, దేవయాని ఒక పక్కకి వెళ్ళి మాట్లాడుకుంటారు. ఇక ఇది చివరి ఘట్టం, మనం మన నటనతో జీవించాలని దేవాయానితో శైలేంద్ర అనగా.. సరేనని చెప్తుంది దేవయాని. ఆ తర్వాత జగతిని శ్మశానానికి తీసుకెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.