English | Telugu

అనామికతో కళ్యాణ్ పెళ్ళి.. కావ్యకి మరో షాక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -218 లో.. తన పుట్టింటి వాళ్ళు రావడంతో కావ్య సంతోషపడుతు వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. మీరు చేసిన సహాయం మర్చిపోలేమని రాజ్ కి థాంక్స్ చెప్తాడు కృష్ణమూర్తి. మీ వల్లే మేం ఈ రోజు ఇలా ఉన్నామంటూ రాజ్ ని పొగడడం స్టార్ట్ చేస్తాడు కృష్ణమూర్తి.

మరొక వైపు అనామిక వాళ్ళ అమ్మ నాన్నలతో దుగ్గిరాల వారి ఇంటికి వస్తుంది. అలా రావడం చూసిన కళ్యాణ్ టెన్షన్ పడుతు కావ్యకి చెప్తాడు. కావ్య కళ్యాణ్ ఇద్దరు వెళ్లి వాళ్ళని రిసీవ్ చేసుకుంటారు. కాసేపటికి అనామిక వాళ్ళ నాన్న దుగ్గిరాల ఇంట్లో వారిని పరిచయం చేసుకుంటాడు. మీతో ఒక విషయం చెప్పాలని వచ్చారని వాళ్ళు వచ్చారంటూ సీతరామయ్యకి కావ్య చెప్తుంది. అందరూ హాల్లో కూర్చొని ఉంటారు. ఏం మాట్లాడాలని సీతరామయ్య అడుగుతాడు. ఇక అనామిక కళ్యాణ్ ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. వాళ్ళు చెప్పేలా లేరని అనామిక వాళ్ళ నాన్న చొరవ తీసుకొని.. వాళ్లిద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నారని చెప్పగానే అందరు సంతోషపడతారు. మీకు వాళ్లకి పెళ్లి చేయడం ఇష్టం అయితే చెప్పండి ముహూర్తాలు పెట్టుకుందామని అనామిక వాళ్ళ నాన్న అనగానే.. సీతారామయ్య సరేనని ఒప్పుకుంటాడు. అలాగే కళ్యాణ్ తల్లి తండ్రులు ఒప్పుకోవాలని సీతారామయ్య అనగా.. ధాన్యలక్ష్మి, ప్రకాష్ లు కూడా ఒప్పుకుంటారు. పెళ్లికి అందరు ఒప్పుకోవడంతో కళ్యాణ్, అనామికతో పాటు కావ్య, రాజ్ లు సంతోషపడతారు. మంచి ముహూర్తం చూసి ఎంగేజ్మెంట్ చెయ్యాలని నిర్ణయించుకుంటారు.

ఆ తర్వాత వినాయకుడి పూజ చెయ్యాలని ఇందిరాదేవి అనగానే.. పూజ మగవాళ్ళు ఎందుకు చెయ్యాలి. ఆడవాళ్లు ఎందుకు చెయ్యకూడదు? మేం చేస్తామని అనామిక అంటుంది. ఇక అందరూ ఆడవాళ్లు, మగవాళ్ళు మేం చేస్తామంటే మేం చేస్తామని అనగా అది చూసిన సీతారామయ్య.. ఒక పోటీ పెడతాను. అందులో ఎవరు గెలిస్తే వాల్లే పూజ చెయ్యాలని అంటాడు. అలా అనేసరికి ఆ ఆట ఆడడానికి అందరు బయటకు వెళ్తారు.

కావ్య ఒకతే రాజ్ చీటీలో ఏం రాసి ఉంటాడని చూడాలి అనుకుంటుంది. అప్పుడే కనకం వచ్చి బయటకు తీసుకొని వెళ్తుంది. ఇక ఆడవాళ్లు, మగవాళ్ళు చెరొక వైపు ఉంటారు. తాడుతో బలవంతంగా లాగిలి. లైన్ దాటి ఎవరు వెళ్తారో వాళ్ళు ఒడిపోయినట్టు కాగా కావ్య వెళ్లి రాజ్ మీద పడిపోతుంది. ఆడవాళ్లు ఓడిపోయారని అనగానే లేదు దీన్ని మేం ఒప్పుకోమంటు మరొక పోటీ పెట్టమని అడుగుతారు. ఈ సారి ఇద్దరు జంటగా ఆడాలని ఇందిరాదేవి చెప్తుంది. దానికి అందరూ సరేనంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.