English | Telugu
కృష్ణ, మురారీల కాపురం బాగుచేయాలని చూస్తున్న రేవతి!
Updated : Jun 22, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -189 లో.. కృష్ణ, మురారి ఇద్దరు బయటకు వెళ్తారు. అక్కడ కృష్ణ తన తింగరి మాటలతో మురారిని తికమక పెడుతుంది. ఏంటి కృష్ణ మీ ఆడవాళ్ళంతా ఇలాగే మాట్లాడుతారా? అందుకేనా ఆడవారి మాటలకూ అర్థాలే వేరని మురారి అంటాడు. అలా కాసేపు ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటారు.
మరొకవైపు ముకుంద కిందకి వస్తుంటే రేవతి అప్పుడే ఇంట్లోకి వస్తుంది. ప్రొద్దున నుండి కన్పించలేదు ఎక్కడికి వెళ్ళావని ముకుందని రేవతి అడుగుతుంది. నేను ఎక్కడికి వెళ్ళానని మీరు అనుకుంటున్నారో అక్కడికే వెళ్ళానని ముకుంద అంటుంది. ఎందుకు వెళ్ళావ్ అని రేవతి అడుగగా.. నా ప్రేమ కోసమని ముకుంద అంటుంది. నీ ప్రేమ నీ పెళ్లితోనే అయిపోయింది. నా ప్రేమ ఎప్పటికి ఉంటుంది. ఎలాగైనా దక్కించుకుంటానని ముకుంద అంటుంది.
ముకుంద తన ప్రేమ మర్చిపోయిందని అనుకున్నా కానీ తన ప్రేమ విషయంలో ఇంత క్లారిటీగా ఉంది. ఇప్పుడు నేనే ముందుకు వెళ్ళాలి. ఎలాగైనా కృష్ణ, మురారీల కాపురం బాగుండేలా చెయ్యాలని రేవతి అనుకుంటుంది..ఆ తర్వాత రేవతి హాల్లో కూర్చొని ముకుంద అన్న మాటలు గుర్తు చేసుకుంటుంది. అప్పుడే కృష్ణ మురారి ఇద్దరు బయట నుంచి వస్తారు. ఆగండి అని వాళ్ళిద్దరికి చెప్పి రేవతి వాళ్ళిద్దరికి దిష్టి తీస్తుంది. అదంతా ముకుంద చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇంటికి పెద్ద కోడలు నువ్వే కదా ముకుంద వాళ్ళకి హారతి ఇవ్వమని రేవతి ముకుంద ని పిలుస్తుంది. ముకుంద వాళ్ళిద్దరికి హారతి ఇస్తుంది. అదంతా చూస్తున్న అలేఖ్య మధులు.. ముకుంద, మురారిల ప్రేమ విషయం రేవతికి తెలిసిందేమోనని అనుకుంటారు.
ఆ తర్వాత కృష్ణ మురారి సరదాగా ఒకరికొకరు ఆటపట్టించుకుంటారు. ఎప్పుడు వాళ్ళు అలా ఉండరు.. ఇలా కూడా ఉంటారని ముకుందతో రేవతి అంటుంది. అంటే తొందరలోనే వీళ్ళు ఈ ఇంటికి వారసుడు ఇస్తారు.. నువ్వు పెద్దమ్మ అవుతావని రేవతి అంటుంటే ముకుందకి కోపం వస్తుంది. అసలు కృష్ణ, మురారి విషయం పెద్ద అత్తయ్యకి తెలిస్తే పరిస్థితి ఏంటని ముకుంద అనగానే రేవతి ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.