English | Telugu
గతాన్ని గుర్తుచేయొద్దని చక్రపాణితో చెప్పిన రిషి!
Updated : Jun 22, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -795 లో.. జగతి గురించి తక్కువ అంచనా వేయొద్దని శైలేంద్రతో దేవయాని అంటుంది. ఎన్ని రోజులని ఇలా ఉండాలి చెప్పాలిసిన టైమ్ వచ్చినప్పుడు నిజం తెలియక మానదని శైలేంద్ర అనగానే.. ఏం నిజమని దేవయాని అడుగుతుంది. రిషి భూమ్మీద లేడు అన్న నిజమని శైలేంద్ర అనగానే.. దేవయాని షాక్ అవుతుంది. అవును మమ్మీ రిషిని రౌడీ లను పెట్టి చంపించేశానని శైలేంద్ర అంటాడు.
ఏం మాట్లాడుతున్నావ్ నాకు ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదని దేవయాని అడుగుతుంది. ఇప్పుడు నేనే వెళ్లి ఇంట్లో అందరికి ఈ విషయం చెప్తానని శైలేంద్ర అనగానే.. వద్దు నువ్వు చెప్పొద్దు.. నిన్న నువ్వు రిషిని ఒక మాట అన్నందుకే మీ నాన్న ఎంత కోప్పడ్డారో చూసావ్ కదా అని దేవయాని అంటుంది. శైలేంద్ర సైలెంట్ గా ఉంటాడు. ఇంట్లో వాళ్లకి నిజం చెప్పకని శైలేంద్రతో దేవయాని అంటుంది. మరొకవైపు వసుధారతో పాటు చక్రపాణి కుడా కాలేజీకి వెళ్లి రిషితో మాట్లాడాలనుకుంటాడు. వసుధారతో చక్రపాణి వస్తానని అంటే ఎందుకు అని అడుగుతుంది వసుధార. నాకు వేరే పని ఉందని చెప్పి వసుధారతో పాటుగా చక్రపాణి బయలుదేరుతాడు. వసుధార కాలేజీలోకి వెళ్తుంది. వసుధార వెళ్ళిన తర్వాత కాసేపటికి రిషి వెళ్తుంటే.. రిషితో చక్రపాణి మాట్లాడాలని ట్రై చేస్తాడు. కానీ చక్రపాణితో మాట్లాడడానికి రిషి ఇష్టపడడు. దాంతో చక్రపాణి వెళ్లిపోతాడు. అదంతా వసుధార చూస్తుంది. ఏంటి సర్ నేను తప్పు చేస్తే నాతో మాట్లాడకండి. అంతేగాని మా నాన్న ఏం అన్నారని వసుధార అంటుంది. ఎప్పటిలాగే నాతో మాట్లాడాలని ట్రై చెయ్యొద్దని రిషి చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు.
ఆ తర్వాత వసుధార, రిషి ఇద్దరు దూరంగా కూర్చొని ఒకరికొకరు సంబంధం లేకుండా ఆలోచనలో ఉంటారు. ఎవరి మనసులో వాళ్ళు మాట్లాడుకుంటారు. అప్పుడే. ఏంజెల్ రిషికి ఫోన్ చేస్తుంది త్వరగా వస్తే షాపింగ్ వెళదామని అనగా.. నాకు ఇంట్రెస్ట్ లేదని రిషి అంటాడు. మరొక వైపు జగతి దగ్గరికి శైలేంద్ర వచ్చి.. నిన్న రిషి గురించి అలా తప్పుగా అన్నందుకు సారీ చెప్తాడు. మహేంద్రకి కూడా సారి చెప్తాడు. మిషన్ ఎడ్యుకేషన్ పనులు నేను కూడా చూసుకుంటాను. రిషిని రీప్లేస్ చేసి ఆ బాధ్యత నేను తీసుకుంటానని శైలేంద్ర అనగానే.. అది అసాధ్యమని జగతి అంటుంది.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే