English | Telugu
"నాకు హగ్ ఇవ్వకపోయినా నా తమ్ముడికి ఇచ్చారు.. అది చాలు''
Updated : Sep 2, 2021
డాన్స్ రియాలిటీ షో 'ఢీ'లో జడ్జ్‌గా చేస్తున్న హీరోయిన్ ప్రియమణి హగ్ కోసం హైపర్ ఆది విపరీతంగా పరితపిస్తాడు. మామూలుగా షోలో ప్రియమణిని ప్రియా... ప్రియా... అని ప్రేమగా పిలుస్తూ ఉంటాడు. అప్పుడప్పుడూ అతడిని ప్రియమణి 'బావా' అని పిలుస్తుంది. ఇవ్వక ఇవ్వక ఒకరోజు ఆదికి ప్రియమణి హగ్ ఇచ్చింది. ఆ రోజు కో టీమ్ లీడర్ సుధీర్ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. 'నాకు హగ్ ఇవ్వకపోయినా... నా తమ్ముడికి ఇచ్చారు. అది చాలు' అని సుధీర్ వీర డైలాగ్ చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ సేమ్ సీన్ 'ఢీ'లో రిపీట్ కానుంది. అయితే... సుధీర్ పాత్రను రష్మీ, ఆది పాత్రను దీపిక పోషించారు.
'ఢీ' అప్‌కమింగ్ ఎపిసోడ్‌లో 'లెట్స్ వెల్కమ్ కింగ్స్ టీమ్ లీడర్స్' అని యాంకర్ ప్రదీప్ ఇన్వైట్ చేయగానే... రష్మీ, దీపిక వచ్చారు. ప్రోమోలో కనిపించింది కాసేపైనా సరే... సుధీర్‌ను రష్మీ దింపేసింది. అలాగే, ఆదిని దీపిక! ప్రియమణి దగ్గరకు వెళ్లి దీపిక హగ్ తీసుకుంది. స్టేజి మీద రష్మీ 'ఇది చాలు' అంటూ సందడి చేసింది. వీళ్లిద్దరి యాక్టింగ్ చూసి సుధీర్, ఆది సహా అందరూ నవ్వుకున్నారు.
సుధీర్ స్టేజి మీద ఉన్నప్పుడు కిందనున్న సెట్ బాయ్స్, డాన్సర్లు 'అన్నా ఏయ్' అంటూ ఉంటారు. సుధీర్ రోల్ రష్మీ చేస్తున్న సమయంలో 'అన్నా ఏయ్' అంటూ గట్టిగా అరిచారు. వాళ్లకు ప్రదీప్ తోడు కలిశాడు. 'ఆగరా... వేస్తా! వేస్తా!' అని రష్మీ రిప్లై ఇచ్చింది. పూర్ణ దగ్గరకు వెళ్లినప్పుడు గులాబీ పువ్వును తినేసింది. 'సూపర్... అది కడగలేదు' అని ప్రదీప్ అనగానే వెంటనే నోట్లో రేకలు ఊసేసింది. ఇంకెంత సందడి చేశారో తెలియాలంటే వచ్చే బుధవారం ఎపిసోడ్ చూడాలి.