English | Telugu
రాజశేఖర్ 'బిగ్ బాస్' హోస్ట్ అయితే?!
Updated : Sep 2, 2021
'స్టార్ మా'లో ఈ ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు 'బిగ్ బాస్' ఐదో సీజన్ షురూ కానుంది. అయితే, అంతకంటే కొన్ని గంటల ముందు, మధ్యాహ్నం ఒంటి గంటన్నరకు 'కామెడీ స్టార్స్' కార్యక్రమంలో కూడా 'బిగ్ బాస్' సందడి చేయనున్నాడు.
'బిగ్ బాస్' థీమ్ మీద 'కామెడీ స్టార్స్'లో సద్దాం టీమ్ ఒక స్కిట్ చేసింది. అందులో 'బిగ్ బాస్' హోస్ట్‌గా సద్దాం సందడి చేయనున్నాడు. అయితే, యాంగ్రీ స్టార్ రాజశేఖర్ వాయిస్, మేజరిజమ్‌తో సద్దాం స్కిట్ చెయ్యడం విశేషం. ఇప్పటివరకు రాజశేఖర్‌ను ఇమిటేట్ చేస్తూ చాలామంది కామెడీ చేశారు. లేటెస్టుగా ఇది అన్నమాట.
'టిక్ టాక్' దుర్గారావు, అతడి వైఫ్ కూడా స్కిట్ లో చేశారు. అంటే... వాళ్ళు 'బిగ్ బాస్ 5'లో లేరన్నమాట. స్కిట్ లో ఛాన్స్ దొరికిందని అషురెడ్డిని కౌగిలోకి తీసుకున్నాడు హరి. గెస్ట్‌గా అలీ అలరించనున్నారు. ప్రోమో చూస్తుంటే... నవ్వించేటట్టు ఉన్నారు.