English | Telugu
రణధీర వర్సెస్ మహాబలి పోటీలో గెలిచిందెవరు?
Updated : Sep 14, 2023
బిగ్ బాస్ సీజన్-7 గ్రాంఢ్ గా ప్రారంభమైంది. హోస్ట్ గా నాగార్జున చేస్తుండగా, హౌజ్ లోకి మొత్తంగా 14 మంది కంటెస్టెంట్స్ వచ్చారు. ఇక మొదటి వారం కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయి, ఇప్పుడు 13మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. కాగా సోమవారం జరిగిన నామినేషన్స్ చాలా హీటెడ్ ఆర్గుమెంట్ జరిగింది. ఇక మంగళవారం నుండి టాస్క్ మొదలైంది. హౌజ్ మేట్స్ ని రెండు టీమ్ లుగా చేసి కొత్త టాస్క్ ని ప్రారంభించాడు బిగ్ బాస్.
ఒక టీమ్ రణధీర, మరొక టీమ్ మహాబలి. అయితే అమర్ దీప్, ప్రిన్స్ యావర్, షకీల, శోభాశెట్టి, శివాజీ, ప్రియాంక జైన్ రణధీర టీమ్ లో ఉన్నారు. గౌతమ్ కృష్ణ, పల్లవి ప్రశాంత్, టేస్టీ తేజ, రతికరోజ్, దామిణి, శుభశ్రీ మహాబలి టీమ్ లో ఉన్నారు. హౌజ్ మేట్ సందీప్ సంచాలకులుగా ఉన్నాడు. కాగా మొదటి టాస్క్ 'పుల్ రాజా పుల్'.. ఒక్కో సమూహం నుండి నలుగురు పోటీకి రావాల్సి ఉంటుంది. మూడు ఛాన్స్ లు వస్తాయి. రెండు లేదా మూడు సార్లు టార్గెట్ లైన్ దాటితే వాళ్ళు ఒక 'కీ' ని పొందడానికి అర్హత సాదిస్తారని బిగ్ బాస్ కోరగా రణధీర టీమ్ గెలిచి, 'కీ' ని సొంతం చేసుకున్నారు.
ఇక రెండవ గేమ్ లో చేతులు , కాళ్ళని వాడుతూ కలర్ నింపిన సర్కిల్స్ పై నుండి ముందుకు వెళ్ళాలి. ఎవరైతే అలా వెళ్ళే ప్రాసెస్ లో తమని తాము కోల్పాతారో వాళ్ళు ఓడినట్టని బిగ్ బాస్ చెప్పాడు. ఇక ఒక్కో టీమ్ నుండి ఒక్కొక్కరుగా వచ్చి తమ బాడీని బెండ్ చేస్తూ చివరివరకు పోరాడారు. ఇందులో కూడా రణధీర టీమ్ గెలుస్తుంది. దాంతో మరొక 'కీ' కూడా రణధీర టీమ్ సొంతం చేసుకుంటుంది. ఇక రణధీర టీమ్ కోసం మాయానిధి ఉన్న గది డోర్ ఓపెన్ అవుతుంది. వాళ్ళు సాధించిన ఆ రెండు 'కీ' లను ఈ నిధిపై ఉంచితే .. ఒక నిధి బయటకు వస్తుంది. అందులో టీమ్ లోని ఒక్కో కంటెస్టెంట్ కి సరిపడా భాగాలు ఉంటాయి. ఒక్కో భాగాన్ని ఒక్కో కంటెస్టెంట్ తీసుకుంటారు. ఇక ఈ ఆరుగురిలో నుండి ఒకరు కంటెస్టెంట్ అవుతారని బిగ్ బాస్ చెప్పాడు.
అయితే ఈ టాస్క్ జరుగుతున్న మధ్యలో రణధీర టీమ్ సాధించిన 'కీ' ని దొంగిలించాలని మాహబలి టీమ్ రాత్రంతా పడుకోకుండా ఉంటారు. అయితే శివాజీ వాళ్ళని తెలివిగా డైవర్ట్ చేస్తాడు. అయితే ఈ ప్రాసెస్ లో శుభశ్రీ పవరస్త్రని దొంగిలించి తనదగ్గర దాస్తుంది. ఇక గెలిచన టీమ్ లోని ప్రిన్స్ యావర్, షకీల, శివాజీ, ప్రియంక జైన్, అమర్ దీప్, శోభా శెట్టి లలో నుండి ఒకరు కెప్టెన్సీ కంటెండర్ అవుతారని బిగ్ బాస్ చెప్పాడు. అయితే ఇప్పటికే ఆట సందీప్ హౌజ్ మేట్ గా కన్ఫమ్ అయిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ మిగిలిన ఆరుగురిలో నుండి మరొకరు హౌజ్ మేట్ గా కన్ఫమ్ కానున్నారు.