English | Telugu
బిగ్ బాస్ సీజన్-7 పై బిత్తిరి సత్తి రివ్యూ!
Updated : Sep 14, 2023
బిత్తిరి సత్తి.. టీవీ యాంకర్ గా తనదైన వాక్ చాతుర్యంతో ఎంతో పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్-7 లో అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ ల మధ్య జరిగిన వివాదాస్పదంగా మారిన 'రైతులు వర్సెస్ బిటెక్ స్టుడెంట్స్' గురించి సరైన వివరణ ఇచ్చాడు బిత్తిరి సత్తి.
బిత్తిరి సత్తి సోషల్ మీడియాలో ఎంతో మంది ఫాలోవర్స్ ని కలిగి ఉన్నాడు. కాగా అతనికి సొంతంగా 'బిత్తిరి సత్తి' అనే పేరుతో యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. ఇందులో ట్రెండింగ్ వీడియోలు, తన సొంత వ్లాగ్స్, టూర్స్ అన్నీ అప్లోడ్ చేస్తూ జనాలకి దగ్గరగా ఉంటున్నాడు బిత్తిరి సత్తి. అయితే మొన్న సోమవారం బిగ్ బాస్ హౌజ్ లో జరిగిన నామినేషన్స్ గురించి బిత్తిరి సత్తి తాజాగా ' Bigg రచ్చ' అనే వీడియోని అప్లోడ్ చేశాడు. దానిలో అమర్ వర్సెస్ ప్రశాంత్ లాగా ద్విపాత్రాభినయం చేశాడు. అయితే యాక్టర్ అంటే ఈజీ కసదు ఎంతో కష్డపడాలి. 24 క్రాఫ్ట్ గురించి నీకేం తెలుసు అంటూ అమర్ దీప్ లాగా మాడ్లాడాడు. ఇక మరొకవైపు నేను రైతు బిడ్డని కాబట్టి నేనిలాగా ఉండానని బిత్తిరి సత్తి చేశాడు.
బిటెక్ చదివిన వాళ్ళలో కూడా రైతులే ఉన్నారు. నువ్వు చెప్పిన లారీ డ్రైవర్, ఆటో డ్రైవర్, ఏ కార్మికులకైనా ఆ లక్ష రూపాయలు ఇవ్చొచ్చు.. కానీ పల్లవి ప్రశాంత్ సాధారణ రైతు కుటుంబంలో పుట్టాడు. అతనికి రైతుల బాధలు, అప్పులు తెలుసు కాబట్టి రైతుకే ఇస్తానని బిత్తిరి సత్తి అన్నాడు. అయిన బిటెక్ చదివినవాళ్ళకి రైతులకి కంపారిజన్ ఏంటి అసలు అంటూ బిత్తిరి సత్తి అమర్ దీప్ ని ప్రశ్నిస్తూ చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అతని ఫాలోవర్సే కాదు యూట్యూబ్ లోని నెటిజన్లు సైతం ప్రతీ రైతు కచ్చితంగా స్పందించాలంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే బిత్తిరి సత్తి ఈ వీడియో చివరన.. నువ్వు అందరిని ఆనందపెడుతున్నావ్, నేను అందరి కడుపు నింపుతున్నానంటూ ముగించాడు బిత్తిరి సత్తి. ఇప్పుడు ఈ వీడియోకి విశేష స్పందన లభిస్తుంది.