English | Telugu

చిత్రని ఇమిటేట్ చేసిన సుధీర్

జబర్దస్త్ షోతో ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు ఎన్నో షోస్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న బుల్లితెర స్టార్ సుడిగాలి సుధీర్. సూపర్బ్, సూపర్బ్, సూపర్బ్ అనే మ్యానరిజమ్ డైలాగ్ తో ఆడియన్స్ కి బాగా పరిచయమే. ఇక సుధీర్ రోజు రోజుకు తనలో ఉన్న టాలెంట్ కి పదును పెట్టుకుంటూ వచ్చాడు . ఇప్పుడు అతను ఒక మల్టీ టాలెంటెడ్ హోస్ట్ గా పేరు తెచ్చుకున్నాడు. పాటలు పాడతాడు, డాన్స్ చేస్తాడు, కామెడీ పండిస్తాడు, ఓవర్ యాక్షన్ చేయకుండా అందరితో సరదాగా కలిసిపోతాడు..ఇలా ఎన్నో క్వాలిటీస్ వలన ప్రేక్షకుల నుంచి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. స్మాల్ స్క్రీన్ పై ఒక బ్రాండ్ లా మారిపోయాడు అంటే అతిశయోక్తి కాదు.

అతను హోస్ట్ గా చేస్తే ఆ ప్రోగ్రాం టీఆర్పీ రేటింగ్ బాగా పెరిగిపోతుందని రేంజ్ లో ఆలోచిస్తున్నారు షోస్ మేకర్స్. అందుకే చాలా షోస్ కి అతన్నే పిలుస్తున్నారు కూడా. బిగ్ స్క్రీన్ మీద ట్రై చేసాడు కానీ అంత వర్కౌట్ కాలేదు. బుల్లి తెర మీద మాత్రం అతనికి, అతని పేరుకి కూడా చాలా డిమాండ్ ఉంది. సుధీర్ ఏ పని చేసినా అందులో ఫీల్ అవుతూ ఇన్వాల్వ్ అవుతూ చేస్తాడు కాబట్టి ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతాడు. ఈ విషయం ఆల్రెడీ సుధీర్, రష్మీ డాన్స్ షోస్ లో తెలిసింది.

ఐతే ఇప్పుడు మరో అడుగు ముందుకేసి చిత్ర గారిని ఇమిటేట్ చేసాడు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతోంది. స్టార్ మాలో ప్రసారమవుతున్న సూపర్ సింగర్ జూనియర్ సింగింగ్ షోకి సుధీర్ హోస్ట్ గా చేస్తున్న విషయం తెలిసిందే. కో-హోస్ట్ గా అనసూయ కూడా ఉంది. జడ్జెస్ గా మనో, చిత్ర ఉన్నారు. ఇక ఈ షోలో సుధీర్ ఒక సాహసం చేసి అందరినీ మెప్పించాడు. చిత్రఒక కంటెస్టెంట్ తో కలిసి ఒక సాంగ్ పాడారు. "నువ్వొస్తానంటే నేనొద్దంటానా " చిత్ర ఎవర్ గ్రీన్ రెయిన్ సాంగ్ అని చెప్పొచ్చు. కంటెస్టెంట్ పాడుతున్న ఈ పాటను మధ్యలో చిత్రవచ్చి పాడారు. ఇక అప్పుడే బుల్లితెర స్టార్ కూడా వచ్చి చిత్రలా పాడటానికి ట్రై చేసాడు. కొన్ని లైన్స్ కూడా పాడాడు. అలా చిత్ర, సుధీర్ కలిసి ఈ పాట పాడి అందరినీ మెప్పించారు. సుధీర్ కి ఈ పాట పాడినందుకు మంచి ప్రశంసలు కూడా దక్కాయి.