English | Telugu

రాహుల్ సిప్లిగంజ్ స‌పోర్ట్ ఎవ‌రికి?

బిగ్‌బాస్ సీజ‌న్ 3 విన్న‌ర్ రాహుల్ సిప్లిగంజ్ బిగ్‌బాస్ సీజ‌న్ 5పై ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. గ‌త సీజ‌న్ 4పై రాహుల్ చేసిన వ్యాఖ్య‌లు ఫైన‌ల్‌లో నిజం కావ‌డంతో సీజ‌న్ 5పై రాహుల్ ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌బోతున్నాడు? .. త‌న స‌పోర్ట్ ఎవ‌రికి అని స్ప‌ష్టం చేయ‌బోతున్నాడ‌న్న‌ది గ‌త కొన్ని రోజులుగా ఆస‌క్తిగా మారింది. అయితే తాజాగా అంతా ఊహించిన‌ట్టే రాహుల్ సిప్లిగంజ్ సీజ‌న్ 5పై త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు.

సీజ‌న్ 5పై ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ సీజ‌న్‌లో ఎవ‌రి స‌త్తాని వారు చూపిస్తున్నార‌ని, హౌస్‌లో కంటెస్టెంట్‌లు త‌గ్గుతున్నా కొద్దీ ఎవ‌రు బెస్ట్ అని చెప్ప‌డం క‌ష్ట‌మ‌న్నాడు. షోను రెగ్యుల‌ర్‌గా ఫాలో అవుతున్నాన‌ని, ఎంజాయ్ చేస్తున్నాన‌ని చెప్పిన రాహుల్ బాగా లేక‌పోయినా షో చూస్తాన‌ని క్లారిటీ ఇచ్చాడు. త‌ను పాల్గొన్న సీజ‌న్ 3కి మంచి టీఆర్పీ రేటింగ్ వ‌చ్చింద‌ని.. అయితే తాజా సీజ‌న్‌ల‌కు అంత‌కు మించి వ‌స్తోంద‌ని పేర్కొన్నాడు.

ఇన్ని చెప్పిన రాహుల్ గ‌త సీజ‌న్ త‌ర‌హాలో త‌ను ఎవ‌రికి స‌పోర్ట్ చేస్తున్న‌ది మాత్రం క్లారిటీ ఇవ్వ‌లేదు. గ‌త సీజ‌న్‌లో తాను అభిజీత్‌కు, సోహైల్‌కు స‌పోర్ట్ చేస్తున్నాన‌ని చెప్పిన రాహుల్ సీజ‌న్ 5 విష‌యంలో ఎవ‌రిని స‌పోర్ట్ చేస్తార‌న్న విష‌యాన్ని మాత్రం చెప్ప‌కుండా దాట‌వేయ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. ఎందుకు రాహుల్ ఈ సీజ‌న్ విష‌యంలో క్లారిటీగా చెప్ప‌డం లేద‌ని ప‌లువురు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. దానికి కార‌ణం ఈ సీజ‌న్ అంతగా ఆక‌ట్టుకోలేక‌పోవ‌డ‌మేన‌ని ప‌లువురు నెటిజ‌న్స్ కామెంట్‌లు చేస్తున్నారు.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.