English | Telugu
సోనియా బుగ్గపై ముద్దు పెట్టిన పృథ్వీ.. షాక్ లో నిఖిల్!
Updated : Sep 18, 2024
బిగ్ బాస్ సీజన్-8 లో ప్రేమాయణం.. వినడానికి ఇది కామన్ గా ఉన్న.. అక్కడ ఉన్నది డిఫరెంట్ పర్సెన్స్. సోనియా, నిఖిల్ మధ్య ఇష్క్ కాదల్ సాగుతుందని నిన్న జరిగిన టాస్క్ లో మరోసారి ఋజువైంది.
హౌస్ లోని కంటెస్టెంట్స్ తమ అహారం కోసం కొన్ని టాస్క్ లని ఆడుతున్నారు. ఇక బిగ్ బాస్ రోజుకో కొత్త టాస్క్ తో ఆడియన్స్ కి ఎంటర్‌టైన్మెంట్ ఇస్తున్నాడు. బిగ్‌బాస్ రెండో టాస్క్ "నత్తలా సాగకు.. ఒక్కటీ వదలకు". ఈ టాస్కు ప్రకారం ప్రతి టీమ్ నుంచి ఇద్దరు సభ్యులు నత్తల్లా పడుకొని వాళ్ళ ముందున్న క్యాబేజీలని తోస్తూ గీతవైపు చేర్చాలి.. ఇచ్చిన టైమ్‌లో ఎక్కువ ఎవరు చేరిస్తే వాళ్లే విన్నర్. ఈ గేమ్‌కి కాంతార టీమ్ నుంచి ప్రేరణ, ఆదిత్య రాగా శక్తి టీమ్ నుంచి సోనియా, నిఖిల్ పోటీ పడ్డారు. సంచాలక్‌గా మణికంఠ ఉన్నాడు. ఈ గేమ్‌లో నిఖిల్ వేగంగా క్యాబేజీని తోస్తూ ముందుకెళ్ళాడు. ఇక సోనియా కూడా బాగానే ఆడింది. దీంతో శక్తి టీమ్ విజేతలుగా నిలిచారు. అయితే విన్నర్‌గా ప్రకటించిన వెంటనే సోనియా బెడ్ రూమ్ లో ఉంటే పృథ్వీ తన దగ్గరికెళ్లి బుగ్గ మీద ఓ కిస్ ఇచ్చాడు.
ఇదేందయ్యా ఇది.. నిన్న మొన్నటి దాకా పెద్దోడు, చిన్నోడు అని అంది.. ఇప్పుడేమో కిస్సులు, హగ్గులు.. ఇది బిగ్ బాస్ హౌసా లేక.. ఆ హౌసా అని ఆడియన్స్ మండిపడుతున్నారు. బాగా ఆడే నిఖిల్ ని గుప్పిట్లో పెట్టుకొని సోనియా ఆడుతుంది. అయితే ఇప్పుడు సోనియా ఖాతాలో పృథ్వీ కూడా చేరాడు. ఈ కిస్ ని చూసిన ఆడియన్స్ మాత్రం ట్రోల్స్ చేస్తున్నారు.