English | Telugu
అనుని ప్రెస్ ముందు బుక్ చేసిన రాగసుధ
Updated : Jun 12, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `ప్రేమ ఎంత మధురం`. `బొమ్మరిల్లు` ఫేమ్ శ్రీరామ్ వెంకట్ నటించి నిర్మించారు. మరాఠీ సీరియల్ `తుల ఫఠేరే` ఆధారంగా ఈ సీరియల్ ని రీమేక్ చేశారు. శ్రీరామ్ వెంకట్, వర్ష హెచ్. కె జంటగా నటించారు. ఇతర పాత్రల్లో రామ్ జగన్, బెంగళూరు పద్మ, జయలలిత, విశ్వమోహన్, జ్యోతిరెడ్డి, అనూష సంతోష్, కరణ్, ఉమాదేవి, రాధాకృష్ణ, మధుశ్రీ, సందీప్ తదితరులు నటించారు. ఆర్యని పోలీస్ కష్టడీ నుంచి తప్పించడం కోసం గన్ పట్టుకుని హల్ చల్ చేస్తుంది అను.
అయితే ఇలా చేయడం వల్ల తనని మరింతగా ఇబ్బందికి గురిచేస్తుందని, నా మాట విని గన్ ఇచ్చేయమని ఆర్య చెప్పడంతో బాధపడుతూనే గన్ ఇచ్చేస్తుంది అను. ఇక అక్కడి నుంచి అనుని ఇంటికి తీసుకెళ్లమని చెబుతాడు ఆర్య. అయితే రాగసుధని కలిసి నిలదీయాల్సిందే అని అమాయకంగా ఆలోచించిన అను.. నీరజ్ ఇంటికి వెళ్లమని చెప్పి తను మాత్రం రాగసుధ వున్నఇంటికి వెళుతుంది. ఆవేశంతో ఊగిపోతూ నమ్మకద్రోహి అంటూ రాగసుధపై విరుచుకుపడుతుంది అను.
తను ఖచ్చితంగా వస్తుందని పసిగట్టిన రాగసుధ.. అను కోసం ప్రెస్ ని ఏర్పాటు చేస్తుంది. తనని రెచ్చగొట్టి మరీ చెంపలు వాయించేలా చేస్తుంది. ఇదంతా జరుగుతుండగానే ప్రెస్ ఎంట్రీ ఇస్తారు. అను .. రాగసుధని బెదిరిస్తున్న దృశ్యాలను, తన గొంతు పట్టుకున్న విజువల్స్ ని షూట్ చేస్తారు. ఈ దృశ్యాలని టీవీ ఛాన్స్ లో చూసిన ఆర్య వర్ధన్ వెంటనే అనుకి ఫోన్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోమంటాడు. ఆ మాటలు విన్న రాగసుధ... అనుని మరింతగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. ఆ తరువాత ఏం జరిగిందో తెలియాలంటే సోమవారం ఎపిసోడ్ చూడాల్సిందే.