English | Telugu
జబర్దస్త్ కమెడియన్ కు అనసూయ వార్నింగ్
Updated : Jun 12, 2022
జబర్దస్త్ కామెడీ షోతో పాపులర్ అయిన యాంకర్ అనసూయ. ఈ షో ద్వారా సినిమాల్లోనూ నటించే ఛాన్స్ ని సొంతం చేసుకుంది. అయినా సరే జబర్దస్త్ ని మాత్రం వీడటం లేదు. నటిగా వరుస సినిమాల్లో నటిస్తూనే యాంకర్ గానూ ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది. తాజాగా జబర్దస్త్ షోలో అనసూయ చేసిన హంగామా నెట్టింట వైరల్ గా మారింది. జూన్ 16న ప్రసారం కానున్న `జబర్దస్త్` కామెడీ షోకు సంబంధించిన తాజా ప్రోమోని విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.
ఈ షోకు ప్రముఖ సింగర్ మనో, ఇంద్రజ న్యాయనిర్ణేతలుగా, అనసూయ యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ షోకు `గాడ్సే` మూవీ హీరో సత్యదేవ్, డైరెక్టర్ గోపీ గణేష్ పట్టాభి హాజరయ్యారు. సీ. కల్యాణ్ నిర్మించిన ఈ మూవీ జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా `జబర్దస్త్` షోలో సందడి చేశారు. తాజా ఎపిసోడ్ లో రాకెట్ రాఘవ, తాగుబోతు రమేష్, రైజింగ్ రాజు తదితరులు టీమ్ లీడర్లుగా వ్యవహరిస్తున్నారు. రాకెట్ రాఘవ కాంట్రాక్ట్ కిల్లర్ స్కిట్ తో అదరగొట్టగా, తాగుబోతు రమేష్ మంగళవారం నా కత్తికి పదును పెట్టను అంటూ నవ్వించాడు.
రైజింగ్ రాజు - దొరబాబు కలిసి అనసూయ హోమ్ టూర్ స్కిట్ ని చేశాడు. `సూయ.. సూయ అనసూయ..` అనే పాటకి నైటీ వేసుకుని అనసూయలా ఎంట్రీ ఇచ్చాడు రైజింగ్ రాజు. అతన్ని చూడగానే అనసూయ గుండె ఒక్కసారిగా పగిలిపోయింది. ఈ కర్మ ఏంట్రా బాబూ అన్నట్టుగా తల కిందికి పెట్టుకుంది. ఈ స్కిట్ లో అనసూయ భర్త సుశాంక్ భరద్వాజ్ ను కూడా వాడేశారు. అతని ప్లేస్ లో దొరబాబుని రంగంలోకి దింపేసరికి అనసూయ హర్ట్ అయింది. రాముడి లాంటి మా అయన పాత్రని దొరబాబుకు ఇచ్చారా? అంటూ నసిగింది. ఇంతలో హోమ్ టూర్ చాలా వైలెంట్ గా వుంది మనం వేరే హోమ్ టూర్ చేద్దాం అంటాడో కమెడియన్. దీంతో ఆపకపోతే వైలెంట్ అవుద్దిప్పుడ్డు అని వార్నింగ్ ఇచ్చింది అనసూయ .. ఇదే షోలో చలాకీ చంటి టాప్ హీరోల గెటప్ లలో కనిపించి అదరగొట్టేశాడు.