English | Telugu

ఫస్ట్ టైమ్ అమ్మాయి వల్ల ఏడ్చిన నిఖిల్.‌. అసలేం జరిగిందంటే!

బిగ్ బాస్ హౌస్ లో టాస్క్ ల పర్వం కొనసాగుతుంది. మెగా చీఫ్ కంటెండర్ అయ్యేందుకు జరుగుతున్న ఈ టాస్క్ లో నాలుగు టీమ్ లుగా విడిపోయారు. హౌస్ లో పానిపట్టు యుద్ధం టాస్క్ జరుగుతుంది. ప్రతీ టీమ్ కి వాళ్ళకి ఇచ్చిన ట్యాంక్ లోని వాటర్ కిందపోకుండా కాపాడుకోవాలి.. ఆపోజిట్ టీమ్ వాళ్ళు వచ్చి ట్యాంక్ లోని వాటర్ తగ్గించే ప్రయత్నం చెయ్యాలి.. అందులో భాగంగా ఇరు టీమ్ ల మధ్య గొడవ జరుగుతుంది.

రెడ్ టీమ్, బ్లూ టీమ్ కి మధ్య గొడవ జరుగుతుంది. టాస్క్ తర్వాత కూడా నిఖిల్ తో యష్మీ మాట్లాడుతుంది. అప్పుడు కూడా ఇరువురు టాస్క్ లో నోరు జారిన మాటల గురించి మాట్లాడుకుంటారు. ఆ తర్వాత పృథ్వీతో నిఖిల్ మాట్లాడుతుంటే యష్మీ వచ్చి.. నిఖిల్ ఆడిన తీరు గురించి మాట్లాడుతుంది. దాంతో నిఖిల్ ఎమోషనల్ అవుతాడు.. అది గేమ్ అని యష్మీ అనగానే.. నాది కాదా గేమ్ అని నిఖిల్ అంటాడు.‌ నా టీమ్ కోసం నేను ఆడుతానని యష్మీ అంటుంది. నాకు లేదా టీమ్ అని నిఖిల్ అంటాడు. మీరు అన్న మాటలు నాకు వినిపించాయి.. ప్రేరణ మీరు బ్లడీ అంటున్నారంటూ నిఖిల్ ఏడుస్తాడు. నిఖిల్ ఏడుస్తుంటే యష్మీ టచ్ చేసి ఏడవద్దని చెప్పబోతుంటే.. నిఖిల్ టచ్ కూడా చెయ్యనివ్వడు. ఎన్ని రోజులు హౌస్ లో ఉన్న ఇక ఇలాగే ఉంటాను.. నా గేమ్ నేను ఆడుతానని నిఖిల్ అంటాడు.

ఏదైనా రిలేషన్ ఉంటే బయట చూసుకుంటాను. హౌస్ లో ఉన్నన్ని రోజులు ఇలాగే ఉంటాను. అసలు ఇప్పుడు పంపించినా వెళ్ళాలని ఉందని చెప్పి.. నిఖిల్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత పృథ్వీకి యష్మీ వివరణ ఇస్తూ.. పృథ్వీ దగ్గర ఏడుస్తుంది. మరుసటి రోజు నుండి నిఖిల్, యష్మీ ఇద్దరు కలిసి మాట్లాడుకున్నదెక్కడా కన్పించలేదు. మరి వీళ్ళిద్దరు ఎన్ని రోజులు ఇలా మాట్లాడుకోకుంటారో చూడాలి మరి.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.