English | Telugu
బిగ్ బాస్ సీజన్ 7 హయ్యెస్ట్ పెయిడ్ కంటెస్టెంట్ నటుడు శివాజీ
Updated : Sep 5, 2023
బిగ్ బాస్ లోకి హౌస్ మేట్స్ అంతా ఎంట్రీ ఇచ్చేసారు. స్టార్టింగ్ డే నుంచి టాప్ గెస్టులు హౌస్ లోకి వెళ్లి మరీ పలకరించి వచ్చారు. నాగ్ కూడా టాస్కులు ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఐతే వీళ్ళ రెమ్యూనరేషన్ ఎంత అనే ఒక ఆసక్తి ఇప్పుడు ఆడియన్స్ లో బయల్దేరింది. ఐతే ఈ సీజన్ లో బిగ్ బాస్ షోలో హైయెస్ట్ రెమ్యునరేషన్ నటుడు శివాజికి ఇస్తున్నారంటూ ఒక ప్రచారం సోషల్ మీడియాలో వినిపిస్తోంది. శివాజికి వారానికి ఏకంగా 4 లక్షలు ఇస్తున్నారట. అలాగే షకీలాకు వారానికి 3.5 లక్షల రెమ్యునరేషన్ అని తెలుస్తోంది.
అలాగే మిగతా హౌస్ మేట్స్ కి వారానికి 2 నుంచి 2.5 లక్షల వరకు ఇస్తున్నట్లు సమాచారం. ఇక మొదటి రోజు నుంచి బట్టలిప్పేసి కండలు చూపిస్తూ తిరుగుతున్న ప్రిన్స్ యావర్ కు వారానికి లక్షన్నర రూపాయలు , పల్లె బిడ్డ పల్లవి ప్రశాంత్ కు వారానికి కేవలం లక్ష అని టాక్ వినిపిస్తోంది. ఇక హోస్ట్ నాగ్ రెమ్యూనరేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది. 10 కోట్లు పైమాటే అంటూ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక రెమ్యూనరేషన్ కి తగ్గట్టే హౌస్ మేట్స్ కంటెంట్ ఇవ్వబోతున్నారు. ఐతే ఎంతమంది హౌస్ మేట్స్ కాస్తా కంటెస్టెంట్స్ గా మారబోతున్నారు. ఇంకా వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఎవరెవరు రాబోతున్నారు...బిగ్ బాస్ బజ్ లో గలాటా గీతూ ఎలాంటి ట్విస్టింగ్ ప్రశ్నలు అడిగి కాంట్రోవర్సి కంటెంట్ అందించబోతోంది..ఏ కంటెస్టెంట్ హౌస్ లో ఎన్ని వారాలు ఉండబోతున్నారు...ఎవరెవరు లవ్ ట్రాక్ నడపబోతున్నారు... అనే విషయాలు ఇప్పుడు ఆడియన్స్ లో ఆసక్తిగా మారాయి.