English | Telugu
డాక్టర్ బాబు ఫ్యామిలీ చేష్టలకు చిరాకుపడుతున్న వీక్షకులు!
Updated : Nov 14, 2021
అతిగా ఆశపడే మగవాడు అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్టు చరిత్రలో లేదు అన్నట్టే అతిగా ఏది చేసినా అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ఇది ఇప్పుడు పాపులర్ సీరియల్ `కార్తీక దీపం` విషయంలో అక్షర సత్యంగా నిలుస్తోంది. గత కొంత కాలంగా మహిళాలోకం నీరాజనాలు అందుకుంటూ దేశ వ్యాప్తంగా పాపులర్ సీరియల్‌గా జేజేలు అందుకున్న `కార్తీక దీపం` తాజాగా తన ప్రాభవాన్ని కోల్పోతోంది. ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుని టాప్ వన్ పొజిషన్‌లో నిలిచిన ఈ సీరియల్ తాజాగా ప్రేక్షకులకు అసహానాన్ని కలిగిస్తోంది.
జాతీయ స్థాయిలో నెంబర్‌వన్ సీరియల్‌గా పాపులారిటీని సొంతం చేసుకోవడమే కాకుండా రేటింగ్ విషయంలోనూ టాప్‌లో నిలిచిన ఈ సీరియల్ గత కొన్ని రోజులుగా దారుణంగా పడిపోతోంది. వంటలక్క దీప క్రేజ్‌తో ఓ రేంజ్‌లో బుల్లితెరపై సందడి చేసిన `కార్తీక దీపం` రేటింగ్ ఇప్పుడు దారితప్పుతోంది. మోనిత నెలతప్పడంతో గాడి తప్పిన ఈ సీరియల్ ప్రేక్షకులకు అసహనాన్ని కలిగిస్తోంది. ఏదో ఒక విధంగా సీరియల్‌ని సాగదీయాని దర్శకుడు కాపుగంటి రాజేంద్ర చేస్తున్న పనులు సీరియల్‌ని దారుణంగా ట్రోల్ కు గురయ్యేలా చేయడమే కాకకుండా రేటింగ్‌ని కూడా ప్రభావితం చేస్తున్నాయి.
21.01 రేటింగ్‌తో ఇండియాలోనే టాప్ రేటింగ్‌ని సాధించిన సీరియల్‌గా ఘనత సాధించిన 'కార్తీక దీపం' ఆ తరువాత నుంచి క్రమ క్రమంగా రేటింగ్ తగ్గుతూ దారుణ స్థాయికి పడిపోతోంది. సాగదీత కారణంగా 21.01 రేటింగ్‌లో వున్న ఈ సీరియల్ రేటింగ్ కాస్తా 18కి పడిపోయింది. తాజాగా అది కాస్తా 12.92కి పడిపోయింది. సీరియల్ టాప్‌లోనే కొనసాగుతున్నా రేటింగ్ విషయంలో మాత్రం వెనకబడిపోతోంది. దీంతో ప్రేక్షకులు వంటలక్కకు ఊహించని షాకిచ్చారని ప్రేక్షకులు చెప్పుకుంటున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో దర్శకుడు కాపుగంటి రాజేంద్ర మళ్లీ కార్తీక దీపాన్ని గాడిలో పెడతారో లేదో చూడాలి.