English | Telugu

నయని పావని వైల్డ్ కార్డ్ ఎంట్రీ...ఈ సారి కూడా వారమేనా!

బిగ్ బాస్ ప్రతీ సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ చాలా ఫేమస్. ఎందుకంటే వారంతా గేమ్ చూసి.‌ ఎవరితో ఎలా ఉండాలో ఓ అంచనాకి వచ్చేసి.. హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారు. గత సీజన్ లో అశ్వినిశ్రీ, నయని పావని, అంబటి అర్జున్ ఎంట్రీ ఇచ్చి ఎలా ఆడారో అందరికి తెలిసిందే.

ఇక సీజన్ 8 లో ఎవరు వస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇప్పటివరకూ మొత్తం నలుగురు కంటెస్టెంట్లు వైల్డ్ కార్డ్ ఎంట్రీకి రెడీ అయ్యారు. యాంకర్ హరితేజ, ముక్కు అవినాష్, జబర్దస్త్ రోహిణి.. బిగ్‌బాస్ 8 లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు కన్ఫమ్ అయింది. ఇక ఆ లిస్ట్‌లోకి బిగ్‌బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ నయని పావని కూడా చేరింది. ఈ బ్యూటీకి ఇన్ స్టాగ్రామ్ లో అత్యధిక ఫ్యాన్ బేస్ ఉంది. గత సీజన్‌లో కూడా నయని వైల్డ్ కార్డ్ ఎంట్రీనే ఇచ్చింది. కానీ వెళ్లిన ఒక్క వారంలోనే ఎలిమినేట్ అయిపోయింది నయని. టాస్కులు, డ్యాన్స్‌లు, ఆటలు ఇలా ప్రతి దానిలోనూ మంచి టాలెంట్ ఉన్నప్పటికీ దురదృష్టవశాత్తు వెళ్లిన వారంలోనే ఇంటికొచ్చేసింది.

ఇప్పటికే హౌస్‌లో గొడవలు, రొమాన్స్, హగ్గులు అన్నీ బాగానే ఉన్నప్పటికీ కామెడీ కాస్త తగ్గింది. దాంతో బిగ్ బాస్ ఎంటర్‌టైన్మెంట్ కోసం అవినాష్, రోహిణిలను హౌస్‌లోకి తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది. ఇక హరితేజ కూడా ఎంత టాలెంటెడ్‌ అనేది అందరికి తెలిసిందే. హౌస్‌లో ఉన్న కన్నడ బ్యూటీలకి హరితేజ గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉంది.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...